Centrel Election Commission Releases Election Shudule: మోగిన నగారా.. లోక్‌సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదల..అమల్లోకి ఎన్నికల కోడ్‌..7 దశల్లో ఓటింగ్.. మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న ప్రారంభం..జూన్ 4న ఓట్ల లెక్కింపు
election commission

న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 97 కోట్ల మంది ఓటర్లు, 10.5 లక్షల పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని ఆయన చెప్పారు. 55 లక్షల ఈవీఎంల నుంచి ఓట్లు వేయనున్నారు. పురుషుల ఓటర్ల సంఖ్య 49.7 కోట్లు, మహిళా ఓటర్ల సంఖ్య 47.1 కోట్లు, మొదటి సారి ఓటర్లు 1.8 కోట్ల మంది ఉన్నారని రాజీవ్ కుమార్ తెలిపారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 82 లక్షలు, 18 నుంచి 19 ఏళ్లలోపు మహిళా ఓటర్ల సంఖ్య 85.3 లక్షలుగా ఉందన్నారు. 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు గల ఓటర్లు 19.74 కోట్ల మంది ఉన్నారు.

> సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని, మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరుగుతుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. రెండో దశ ఓటింగ్ ఏప్రిల్ 26న జరగనుంది.

>>  2024 లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి.