సీతామర్హి, సెప్టెంబర్ 13: బీహార్‌లోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం (సెప్టెంబర్ 12) మధ్యాహ్న భోజనం తిన్న 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు అధికారి తెలిపారు. "సెప్టెంబర్ 12 న సీతామర్హి జిల్లాలోని డుమ్రా బ్లాక్‌లోని ఒక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత సుమారు 50 మంది పాఠశాల విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో ఫిర్యాదు చేశారు" అని అధికారి తెలిపారు.చిన్నారులను సదర్ ఆసుపత్రికి తరలించారు. పిల్లలందరి పరిస్థితి నిలకడగా ఉందని ఓ అధికారి తెలిపారు.
సదర్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుధా ఝా మాట్లాడుతూ, " మధ్యాహ్న భోజనంలో ఊసరవెల్లి కనిపించిందని వారు ఫిర్యాదు చేశారు . వారు అదే ఆహారాన్ని తిన్నారు, ఇక్కడ ఉన్న పిల్లలందరూ స్థిరంగా, లక్షణాలు లేకుండా ఉన్నారు. మేము వారిని పరిశీలనలో ఉంచాము. ఇప్పుడు అంతా మామూలే.. వాళ్ల తల్లిదండ్రులు వాళ్ల దగ్గరే ఉన్నారు.. కంగారు పడాల్సిన పని లేదన్నారు.