జార్ఖండ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ చేరనుంది. వారం రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ (Champai Soren) తెలిపారు. అలాగే కలిసి వచ్చే వారితో పొత్తు పెట్టుకుంటానని చెప్పారు. ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లిన ఆయన బీజేపీలో చేరుతారంటూ ఊహాగానాలు వచ్చాయి. జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం, బీజేపీలో చేరనున్న మాజీ సీఎం చంపై సోరైన్, పలువురు ఎమ్మెల్యేలతో బీజేపీలోకి!
అయితే తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళిక గురించి చంపై సోరెన్ బుధవారం స్పష్టత ఇచ్చారు. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘మూడు అవకాశాల గురించి నేను ప్రస్తావించా. పదవీ విరమణ, కొత్త పార్టీ లేదా వేరే పార్టీలో చేరిక. నేను పదవీ విరమణ చేయను. కొత్త పార్టీని బలోపేతం చేస్తా. మంచి స్నేహితుడిని కలిస్తే వారితో కలిసి ముందుకు సాగుతా’ అని అన్నారు.