Jharkhand, Aug 18: జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తె దిశగా పరిణామాలు కనిపిస్తున్నారు. జేఎంఎం సీనియర్ నేత, మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరే అవకాశం ఉంది. చంపై సోరెన్‌తో పాటు కొంతమంది జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. సోరెన్ బృందం ఢిల్లీకి బయల్దేరారు. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా జేఎంఎం నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడగా హేమంత్ సోరేన్ సీఎంగా ఉన్నారు. ఇటీవల ఈడీ కేసులో హేమంత్ సోరేన్ జైల్లో ఉన్నపుడు సీఎంగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
త్వరలో జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికల జరగనున్న నేపథ్యంలో జరుగుతున్న రాజకీయ పరిణాలు చర్చనీయాంశంగా మారాయి. చంపై సోరెన్‌తో కోల్‌కతాలో బీజేపీ నేత సువేంద్ అధికారి సమావేశమయ్యారు. ఈ భేటీలో జేఎంఎం పార్టీకి చెందిన నలుగురు ముఖ్యనేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హైప్రొఫైల్ మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆతర్వాత హేమంత్ సోరెన్‌కు బెయిల్ రావడంతో తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
Here's Tweet:
జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం దిశగా పరిణామాలు.. మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీలో చేరే అవకాశం.. చంపై సోరెన్‌తో పాటు కొంతమంది జేఎంఎం ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే ఛాన్స్.. ఢిల్లీ బయల్దేరిన మాజీ సీఎం చంపై సోరెన్ బృందం.. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు.. ప్రస్తుతం జార్ఖండ్‌లో ఇండియా…
— NTV Breaking News (@NTVJustIn) August 18, 2024
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల జార్ఖండ్‌కు చెందిన ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలోనే చంపై సోరెన్ ప్రస్తావన రాగా మాతో ఎవరూ టచ్‌లో లేరని తెలిపారు. కానీ సీన్ కట్ చేస్తే తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణమాలను గమనిస్తే చంపై సోరెన్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.