మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో తాజాగా చిరుత పులి పిల్ల మృతి చెందింది. జ్వాల అనే ఆడ చిరుత పిల్లల్లో ఒకటి అందులో ఒకటి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందింది. జ్వాల మార్చి 24న నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, మృతికి కారణాలు మాత్రం తెలియలేదని, అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే కునోలో మూడు చిరుతలు మృతి చెందిన విషయం తెలిసిందే. సాషా, దక్ష ఆడ చిరుతలతో పాటు ఉదయ్ అనే మగ చిరుతల ఇటీవల మరణించాయి.ప్రస్తుతం కునోలో 17 చిరుతలు, మూడు పిల్లలు మిగిలాయి. సుమారు 75 సంవత్సరాల ట్రాన్స్‌లోకేషన్ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా నమీబియాతో పాటు దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 20 చిరుతలను భారత్‌కు తరలించారు.