Raigarh, May 7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన మరవకముందే ఛతీస్‌గఢ్‌లో (Chhatisgarh) మరో గ్యాస్ లికేజీ ఘటన చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లులో (Rajgarh Gas Leak) గ్యాస్ లీకై ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలొ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైజాగ్ గ్యాస్ లీక్ విషాదం, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం, తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య, ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపిన ఏపీ సీఎం
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా దాదాపు నెలన్నర రోజులుగా పరిశ్రమలు అన్ని మూతపడ్డాయి. ఇటీవల కేంద్రం సడలింపులు ఇవ్వడంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు పరిశ్రమలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో రాయ్‌గఢ్‌లోని పేపర్ మిల్లు కూడా ప్రారంభమయింది. గురువారం మధ్యాహ్నం మిల్లులోని ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు (Paper Mill workers) వెళ్లారు.
ట్యాంకులోకి దిగి శుభ్రం చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకై అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు, పోలీసులు అక్కడికి చేరుకొని.. కార్మికులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Raigarh SP Santosh Singh's Statement:
Chhattisgarh: Raigarh Superintendent of Police Santosh Singh & Collector Yashwant Kumar meet those who were affected by gas leak at a paper mill in the district. SP says, "Owner of the mill tried to hide the incident from us & did not inform police. A case will be registered". https://t.co/VsOVl6l3TU pic.twitter.com/p1D73NLAVW
— ANI (@ANI) May 7, 2020
విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి గ్యాస్ లీక్ అయిన కొన్ని గంటల తర్వాత ఛత్తీస్‌గఢ్ లో ఈ సంఘటన జరిగింది. కాగా విశాఖ గ్యాస్ లీకేజీ (izag Gas Leak) ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 200 మంది ఆసుపత్రి పాలయ్యారు. విశాఖపట్నంలోని ఆసుపత్రుల్లో బాధితులను సందర్శించిన తరువాత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ప్రకటించారు.
వైజాగ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) లో గ్యాస్ లీక్ సంఘటన జరిగిన కొన్ని గంటల తరువాత ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్రానికి నోటీసు ఇచ్చింది. గ్యాస్ లీక్ గురించి మీడియా నివేదికలను NHRC స్వయంగా తెలుసుకుంది.