Raipur, Nov 28: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో సమాజం సిగ్గుపడే ఘటన (Chhattisgarh Horror) చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి, చిన్నాన్నలే ఇద్దరు కూతుళ్లపై అఘాయిత్యానికి ( Father, Uncle Sexually Abuse ) ఒడిగట్టారు. ఈ దారుణం తట్టుకోలేక ఆరేండ్ల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే తండ్రి మిస్సింగ్ కేసు పెట్టడంతో ఇటీవల పోలీసులు వారి జాడను ఆపరేషన్ ముస్కాన్ కింద గుర్తించి రాయ్‌పూర్ నుంచి తీసుకొచ్చారు. అయితే, వాళ్లు పారిపోవాల్సి రావడానికి గల కారణాలను పోలీసులకు చెప్పడంతో (Chhattisgarh Sisters Before Rescue) పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
దారుణ ఘటన వివరాల్లోకి వెళ్తే.. 2017 నుంచి బాధితులైన అక్కా చెల్లెళ్లపై లైంగిక వేధింపులు మొదలయ్యాయి. అప్పటికి అక్కకు వయసు 17 సంవత్సరాలు, చెల్లెలి వయసు 16 సంవత్సరాలు. వాళ్ల తల్లికి మతిస్థిమితం లేకపోవడంతో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ తరచూ తన చిన్నమ్మ ఇంటికి వెళ్లేవారు. ఈ క్రమంలోనే చిన్నాన్న కన్ను వీరిపై పడింది. వాళ్ల చిన్నమ్మలేని సమయంలో చిన్నాన్న ఇద్దరిపై వచ్చినప్పుడల్లా అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ దారుణాన్ని తండ్రికి చెప్పగా.. రక్షణ కల్పించాల్సిన తండ్రి కూడా వాళ్లనే దూషించి, తర్వాత అతను కూడా వాళ్లపై అత్యాచారానికి పాల్పడటం మొదలుపెట్టాడు.దాంతో బాధితురాళ్లు భయంతో ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుని పారిపోయారు. అనంతరం వాళ్ల తండ్రి తాను ఏమీ ఎరగనట్టే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనబిడ్డలు ఇద్దరూ మిస్సయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు బాధితురాళ్ల జాడ దొరకడంతో నిందితుల బండారం బయటపడింది.
పోలీసులు నిందితులిద్దరినీ కటకటాల్లోకి పంపించారు. బాధితురాళ్లు చేసిన ఆరోపణల ఆధారంగా, అరెస్టు చేసిన వారిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (రేప్), 354 (ఒక మహిళపై దాడి చేయడం లేదా క్రిమినల్ బలవంతం చేయడం, ఆమె నమ్రతకు భంగం కలిగించడం), ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశామని ఛవానీ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రభాత్ కుమార్ తెలిపారు.