Raipur, May 18: కోవిడ్ 19 నియంత్రణ చర్యల్లో భాగంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం (Chhattisgarh government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 144 సెక్షన్‌ను మరో నెలల పాటు పొడిగిస్తూ (Sec 144 Extended In Chhattisgarh) ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 28 జిల్లాలకు ఆ రాష్ట్ర హోంశాఖ నోటీసులు పంపింది. కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి నివారణకే 144 సెక్షన్‌ను పొడిగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇండియాలో లక్షకు చేరువలో కరోనా కేసులు, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 5,242 కొత్త కోవిడ్ 19 కేసులు, వణికిస్తున్న ముంబై
మే 31వ తేదీ వరకు రెస్టారెంట్లు, హోటల్స్, బార్లు, క్లబ్‌లు మూసి ఉంటాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్పోర్ట్స్ కాంప్లెక్సులు, స్టేడియంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసి ఉంటాయని స్పష్టం చేశారు. 144 సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) ఇప్పటి వరకు 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం ఒక్కరోజే 25 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 33 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 59 మంది కోవిడ్ 19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.