China's New Border Law: వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు, చొరబడితే చైనా ఆర్మీని తరిమికొట్టే తీరుతాం, వార్షిక ఆర్మీ డే సమావేశంలో భారత సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే
MM-Naravane (Photo-ANI)

New Delhi, Jan 12: సరిహద్దులో చైనా భారత్ మధ్య వివాదం రేగుతూనే ఉంది. ఈ వివాదానికి చైనా ఏదో విధంగా ఆజ్యం పోస్తూనే ఉంది. లడఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి చైనా దళాల ఉపసంహరణ పాక్షికంగా జరిగినప్పటికీ, ఈ ప్రాంతంలో ముప్పు కొనసాగుతోందని భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నరవనే చెప్పారు. ముప్పు ఉన్నప్పటికీ చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)ని భారత సైన్యం స్థిరంగా, దృఢ సంకల్పంతో ఎదుర్కొంటుందని తెలిపారు. చైనా యొక్క కొత్త సరిహద్దు చట్టంపై మాట్లాడుతూ.. జనరల్ MM నరవణే చైనాకు బలమైన సంకేతం పంపారు, 'మనం గతంలో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా చట్టం లేదు' అని అన్నారు.

వార్షిక ఆర్మీ డే సందర్భంగా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020లో సైనిక ప్రతిష్టంభన ప్రారంభమై, 2022లో కూడా కొనసాగుతున్న ప్రాంతాల్లో దళాలను పెంచినట్లు తెలిపారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దులు (చైనా, పాకిస్థాన్) వెంబడి గత ఏడాది జనవరి నుంచి సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఉత్తర సరిహద్దుల్లో (చైనా) తాము నిరంతరం కార్యకలాపాల నిర్వహణకు సన్నద్ధతను కొనసాగిస్తున్నామన్నారు. అదే సమయంలో పీఎల్ఏతో చర్చల ద్వారా సంబంధాలను ఏర్పరచుకున్నట్లు తెలిపారు.

తూర్పు లడఖ్‌ నుంచి దళాల ఉపసంహరణ, బుధవారం జరుగుతున్న భారత్, చైనా సీనియర్ మిలిటరీ కమాండర్ల 14వ విడత చర్చల గురించి మాట్లాడుతూ, పెట్రోలింగ్ పాయింట్ 15 సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇది పరిష్కారమైతే ప్రస్తుత ప్రతిష్టంభనకు కారణమైన ఇతర అంశాలను పరిశీలిస్తామని తెలిపారు. పాకిస్థాన్ వైపు ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చేరుకుని, మన దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మన దేశంలోకి చొరబడేందుకు ఆ ఉగ్రవాదులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. దీనినిబట్టి మన పశ్చిమ దిశలోని పొరుగు దేశం (పాకిస్థాన్) పన్నుతున్న కుట్రపూరిత పన్నాగాలు బయటపడుతున్నాయని చెప్పారు.

యూపీలో బీజేపీకి షాక్, 13 మంది ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరుతారని బాంబు విసిరిన శరద్‌ పవార్‌, మౌర్యతో పాటు పార్టీని వీడిన మరో ఎమ్మెల్యే

నాగాలాండ్‌లో సాధారణ పౌరులపై సైన్యం కాల్పుల సంఘటనపై మాట్లాడుతూ, దర్యాప్తు పూర్తయిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అలా జరగడం అత్యంత విచారకరం అన్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌లో మరిన్ని దిద్దుబాటు చర్యలు చేపడతామని చెప్పారు. ఈశాన్య భారతంలో పరిస్థితి నియంత్రణలో ఉందన్నారు. భారత్-మయన్మార్ సరిహద్దులో అస్సాం రైఫిల్స్ బెటాలియన్లను పెంచాలనే ప్రణాళిక ఉందని తెలిపారు. ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో సుమారు 5,300 మంది భారత సైనికులు ఉన్నారని తెలిపారు.

సరిహద్దులో ఎంత సీరియస్ ఆపరేషన్లు కొనసాగుతున్నా, తాము పౌరుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుంటామని తెలిపారు. పశ్చిమ సరిహద్దులో టెర్రరిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్నాయని లైన్ ఆఫ్ కంట్రోల వెంబడి పదే పదే చొరబాట్లకు ప్రయత్నిస్తూనే ఉన్నారని నరవణే ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా ఆర్మీని సమర్థవంతంగా ఎదుర్కుంటామని వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని ఆర్మీ చీఫ్ తెలిపారు.

21వ శతాబ్దపు భారతదేశంలో మీడియా సంస్థలు పోషిస్తున్న పాత్రను గుర్తిస్తూ, బలమైన దేశాన్ని నిర్మించడంలో రాష్ట్రంలోని ఇతర స్తంభాలతో పాటు మిలటరీ, మీడియా రెండూ ముఖ్యమైన పాత్ర పోషించాలని నరవాణే అన్నారు. భవిష్యత్తులో మా ఇద్దరి మధ్య ( మీడియా మిలిటరీ) చాలా బలమైన మరియు నిరంతర భాగస్వామ్యం కోసం నేను ఎదురుచూస్తున్నాను అని ఆర్మీ చీఫ్ చెప్పారు, మెరుగైన ఇంటెల్ మరియు సైనిక సామర్థ్యాలతో, భారత సైన్యం మరియు అన్ని విభాగాలు సాయుధ దళాలు ఇప్పుడు వారి దిశలో విసిరిన ఏ సవాలునైనా ఎదుర్కొనేందుకు మరింత మెరుగ్గా సిద్ధంగా ఉన్నాయి.