CJI BR Gavai (Photo Credits: ANI)

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: సుప్రీంకోర్టులో ఈ రోజు ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. న్యాయవాది వేషధారణలో ఉన్న వ్యక్తి.. దేశ ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్ కూర్చున్న డయాస్ వైపు షూ విసరడానికి ప్రయత్నించడం, కోర్టు వాతావరణాన్ని ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్క‌డే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంట‌నే క‌ల‌గ‌జేసుకుని ఆ లాయ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.అతనిని కిశోర్ గా గుర్తించారు.

అతన్ని బయటకు తీసుకెళ్తున్న సమయంలో, కిషోర్ రాకేష్ “సనాతన్ కా అప్మాన్ నహీ సహింగే, సనాతన్ ధర్మాన్ని అవమానిస్తే మౌనంగా ఉండం” అంటూ నినాదాలు చేసినట్లు కోర్టులో ఉన్న న్యాయవాదులు చెప్పారు. ఈ అకస్మాత్తు చర్య కారణంగా కోర్టు విచారణకు కాసేపు అంతరాయం ఏర్పడింది.అయితే, ఈ అనూహ్య ఘటన సమయంలో సీజేఐ గవాయ్ ప్రదర్శించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆయన ఏ విధమైన ఆందోళన లేకుండా, “ఇలాంటి సంఘటనలు మనల్ని ప్రభావితం చేయవు. దయచేసి ఎవరూ ఆందోళన చెందకండని తెలిపారు. విచారణను నిలిపివేయకుండా కొనసాగిస్తూ, ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దని, సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి సర్కారుకు ఊరట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున జోక్యం చేసుకోలేమని స్పష్టం

ఈ సంఘటనపై న్యాయవాద వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (SCAORA) అత్యవసర సమావేశం నిర్వహించి, ఈ ఘటనపై తీవ్ర ఖండన వ్యక్తం చేసింది. న్యాయవాది వేషంలో ఉన్న వ్యక్తి కోర్టు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం అత్యంత దురదృష్టకరమని పేర్కొంది. SCAORA తీర్మానంలో ఇలాంటి ప్రవర్తన న్యాయవృత్తి గౌరవానికి విరుద్ధం. ఇది రాజ్యాంగ విలువలు, మర్యాదా సూత్రాలు, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విరుద్ధం. ఈ చర్య సుప్రీంకోర్టు ప్రతిష్టను ప్రజల దృష్టిలో తగ్గించే ప్రయత్నమని పేర్కొంది.

అలాగే, ఈ ఘటనను సుప్రీంకోర్టు స్వయంగా పరిగణించి ధిక్కార (Contempt of Court) చర్యలు ప్రారంభించాలని బార్ బాడీ కోరింది. న్యాయవ్యవస్థపై ఇలాంటి దాడులు సహించరాని అంశాలు” అని పేర్కొంటూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఇక సీజేఐ గవాయ్ ఈ ఘటనను లైట్ తీసుకుని కోర్టు గౌరవాన్ని కాపాడిన తీరు న్యాయవర్గాల నుండి ప్రశంసలు అందుకుంటోంది.

ఇక సుప్రీంకోర్టు స్వయంగా ఈ ఘటనను స్వీయ పరిధిలోకి తీసుకుని ధిక్కార (Contempt of Court)చర్యలు ప్రారంభించాలని కూడా బార్ బాడీ కోరింది. వాక్ స్వాతంత్ర్యం పవిత్రమైనదే అయినప్పటికీ, న్యాయవాద వృత్తి సభ్యులైన కోర్టు అధికారులకు సంయమనం, మర్యాద పాటించాల్సిన బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.