Crime | Representational Image (Photo Credits: Pixabay)

విద్యార్థులకు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఓ లేడీ లెక్చరర్ అందుకు విరుద్దంగా ప్రవర్తించింది. విద్యార్ధికి పాఠాలు చెప్పాల్సిన ఆమె ఆ విద్యార్థితో ప్రేమాయణంలో పడింది. అంతటితో ఆగకుండా ఇంటర్ చదువును మధ్యలోనే ఆపేసి లేపుకుని వెళ్లింది. ఆ తర్వాత పెళ్లిచేసుకుని తాపిగా ఇంటికి చేరింది.

తమిళనాడు రాష్ట్రంలోని తురయూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధికి, అదే కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న 26 సంవత్సరాల షర్మిలలు ఇద్దరు ఒకేసారి ఈ నెల 5న అదృశ్యమయ్యారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు విద్యార్థి చదివే కాలేజీకి వెళ్లి విచారించారు.

RIP Abhishek Chatterjee: చిత్ర పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు అభిషేక్ ఛటర్జీ గుండెపోటుతో కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన సీఎం దీదీ

దీంతో వారికి షాకింగ్ నిజాలు తెలిశాయి.. అదే రోజు కాలేజీ లెక్చరర్ షర్మిల కూడా అదృశ్యమయినట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరు కలిసి పారిపోయారా అనే కోణంలో అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా విచారణ చేపట్టారు. ఇక వారు అనుమానం వ్యక్తం చేసినట్టుగానే ఇద్దరు కలిసి పారిపోయారు. దీంతో షర్మిల సెల్ ఫోన్’ సిగ్నల్స్‌ను బట్టి వారి అడ్రస్‌ను కనుక్కొన్నారు. అక్కడి వెళ్లి వారిని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఇక షర్మిలను అదుపులోకి తీసుకుని ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.