Bhopal December29: అవినీతి చేస్తే బుద్ది చెప్పాల్సిన పార్లమెంట్ సభ్యుడు...కరప్షన్ కు లిమిట్ పెట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా(BJP MP Janardan Mishra) అవినీతికి హద్దులు చెప్పారు. సర్పంచ్‌లు రూ. 15 లక్షలకు పైబడి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే తనను సంప్రదించాలని వ్యాఖ్యానించారు.
ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి(Inviting controversy). ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని రేవాలో జరిగిన ‘ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడంలో మీడియా పాత్ర’ అనే సెమినార్‌లో ఎంపీ మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.
...When people accuse sarpanch of corruption, I jokingly tell them that if corruption is up to Rs 15 lakhs don't come to me...come only if it's (corruption) beyond Rs 15 lakhs: BJP MP Janaradan Mishra in Rewa, Madhya Pradesh (27.12) pic.twitter.com/ImobGWecBH
— ANI (@ANI) December 28, 2021
సర్పంచ్(Sarpanch) పై ప్రజలు అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు అతను రూ.15 లక్షల వరకు అవినీతి చేసి ఉంటే తన వద్దకు రావద్దని(corruption is up to Rs 15 lakh don’t come to me), రూ.15లక్షలకు పైబడితేనే తన వద్దకు రావాలనడంతో సెమినార్‌కు హాజరైన వారు కంగుతిన్నారు. సెమినార్‌లో భాగంగా ఎంపీ మాట్లాడుతూ సర్పంచ్‌లు అవినీతికి పాల్పడ్డారంటూ ప్రజలు పెద్ద ఎత్తున తన వద్దకు వస్తున్నారని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రూ.7లక్షలు, తదుపరి ఎన్నికల సమయంలో రూ.7లక్షలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా మరో లక్ష ఖర్చుచేస్తున్నారని ఎంపీ అన్నారు. అవినీతి చేయొద్దని బుద్ది చెప్పాల్సిన ఎంపీ యే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రజలు కూడా షాక్ అయ్యారు.