
Hyd, Sep 25: అవినీతి ఆరోపణల నేపథ్యంలో (corruption allegations) వరంగల్ రూరల్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి సతీష్ కుమార్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సస్పెండ్ (Warangal Rural SI suspended) చేశారు.ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ కార్యాలయం ఆదివారం విడుదల చేసిన నోట్‌లో పేర్కొంది.తన న్యూడ్ వీడియోలు, ఫొటోస్‌తో సీఐ వేధింపులకు గురిచేస్తున్నారని ఓ మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి సుబేదారి ఉమెన్ పీఎస్‌లో పనిచేస్తున్న సీఐ సతీష్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. వివిధ కేసుల్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలను సీఐ డబ్బులు కోసం వేధింపులకు గురిచేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.తన వేధిస్తున్నాడని సుబేదారి ఉమెన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళ నుంచి కేసు నమోదు చేయడానికి రూ.50వేల లంచం తీసుకున్నట్లు సీఐపై ఆరోపణలు వచ్చాయి.
సీఐ వ్యవహారాలపై విచారణ చేపట్టిన సీపీ తరుణ్ జోషి.. సతీష్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐపై అవినీతి ఆరోపణలతో పాటు, లైంగిక వేధింపుల ఆరోపణలు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి.