Rashtrapati Bhavan (Photo Credits: PTI)

New Delhi, April 29: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా 'ఆరోగ్య సేతు' యాప్‌లో (Aarogya Setu App) వారి ఆరోగ్య స్థితిని సమీక్షించాలని, ఆ తర్వాతే కార్యాలయానికి బయలుదేరాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం (Govt Tells Central Govt Employees) ఆదేశించింది. భారతదేశంలో పెరుగుతున్న COVID-19 కేసుల మధ్య, ప్రభుత్వం తమ మొబైల్ ఫోన్లలో 'ఆరోగ్యా సేతు' యాప్‌ను వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని తన అధికారులు, సిబ్బంది (అవుట్‌సోర్స్ సిబ్బందితో సహా) అందరినీ కోరింది.  ప్రధాని మోదీ చెప్పిన యాప్ ఇదే, ఆరోగ్య సేతు యాప్ మీ దగ్గరఉంటే కరోనా పూర్తి వివరాలు మీ చేతుల్లో ఉన్నట్లే, ఎలా వాడాలో తెలుసుకోండి

ఆఫీస్‌కు బయలుదేరే ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్య సేతు యాప్‌ తమ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవాలని.. యాప్‌లో ‘సేఫ్’ లేదా ‘లో రిస్క్‌’ అని చూపెడితేనే ఆఫీస్‌కు రావాలని సూచించింది. ఒకవేళ బ్లూటూత్‌ సామీప్యత ఆధారంగా యాప్‌లో ‘మోడరేట్’ లేదా ‘హై రిస్క్‌’ అని స్టేటస్‌ చూపెడితే ఆఫీస్‌కు రానవసరం లేదని తెలిపింది.

అటువంటి వారు 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండటం కానీ, యాప్‌లో స్టేటస్‌ లో రిస్క్‌ లేదా సేఫ్‌ అని చూపెట్టేవరకు ఇంటివద్దే ఉండాలని సూచించింది. కేంద్ర మంత్రిత్వశాఖల్లో, కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఈ ఆదేశాలు తప్పకుండా అమలయ్యే చూడాలని జాయింట్‌ సెక్రటరీలను ఆదేశించింది.

Take a Look at the Tweets:

కాగా కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి ప్రతి ఒక్కరు ఆరోగ్య సేతు ఉపయోగించాలని కేంద్రం చెబుతున్న సంగతి తెలిసిందే. అలాగే కరోనా తాజా సమాచారంతో పాటుగా వైరస్‌ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలను అందించే ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.