New Delhi January 06: ప్రధాని మోదీ(Prime Minister Modi) పంజాబ్ పర్యటన సందర్భంగా నెలకొన్న భద్రతా లోపాల(lapses in the security arrangements)పై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర హోంశాఖ. ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లలో జరిగిన తీవ్ర లోపాలపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు(Committee constituted to esquire) చేస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(Home Ministry Of India) తెలిపింది.
వీవీఐపీ తీవ్ర భద్రతా ప్రమాదానికి గురికావడానికి దారితీసిన లోపాలను పరిశీలించే ఈ కమిటీకి క్యాబినెట్ సెక్రటేరియట్ సెక్రటరీ (సెక్యూరిటీ) సుధీర్ కుమార్ సక్సేనా(Sudir kumar saxena) నేతృత్వం వహిస్తారని ప్రకటించింది. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్(Balbir Singh), స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) ఐజీ ఎస్ సురేష్(Suresh) మరో ఇద్దరు సభ్యులని పేర్కొంది. నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాలని కమిటీకి సూచించినట్లు వెల్లడించింది.
Ministry of Home Affairs(MHA) has constituted a committee to enquire into the serious lapses in the security arrangements during Hon'ble Prime Minister Shri Narendra Modi’s visit to Ferozepur, Punjab on 05.01.2022,which led to the exposure of the VVIP to grave security risk.
— Spokesperson, Ministry of Home Affairs (@PIBHomeAffairs) January 6, 2022
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్(Ferozepur)లో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా రైతులు ఫ్లై ఓవర్ ను నిర్బంధించి నిరసన తెలిపారు. దీంతో కారులో రోడ్డు మార్గంలో సభా స్థలానికి బయలుదేరిన ప్రధాని మోదీ సుమారు 20 నిమిషాలపాటు ఫ్లైవోవర్‌పై కారులోనే ఉండిపోయారు. అనంతరం వెనుతిరిగి ఎయిర్‌పోర్టుకు చేరిన ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య ఈ ఘటన మరింత వివాదాన్ని రాజేసింది.