Congress Leader Sanjay Jha (Photo Credits: Twitter/JhaSanjay)

Mumbai, May 22: మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ముంబైలో (Mumbai COVID-19) అయితే కోవిడ్ కేసులు రోజు రొజుకు దడపుట్టిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ ఝాకు (Congress spokesperson Sanjay Jha) కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం మధ్యాహ్నం ట్విట్టర్‌ (Twitter) వేదికగా ప్రకటించారు. ట్విట్టర్లో ఆయన ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ ‘ఇంతవరకు నాలో కరోనా లక్షణాలు ఏవి కనిపించలేదు. అయినా నాకు కరోనా పాజిటీవ్‌ అని తేలింది. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 6088 కోవిడ్ 19 కేసులు, ఇండియాలో లక్షా 18 వేలు దాటిన కరోనా కేసులు సంఖ్య, 3583కి చేరిన మృతుల సంఖ్య

రాబోయే 10-12 రోజులు నేను హోం క్వారంటైన్‌లో ఉండబోతున్నాను. కరోనా వ్యాప్తి లక్షణాలను తక్కువగా అంచనా వేయకండి. మనందరికి కరోనా ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండండి’ అంటూ సంజయ్‌ ఝా ట్వీట్‌ చేశారు. ఇలా ట్వీట్‌​ చేసిన కొద్ది నిమిషాల్లోనే పలువురు కాంగ్రెస్‌ నాయకులు, బీజేపీ నాయకులు సంజయ్‌ ఝా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ రీట్వీట్‌ చేశారు. వీరిలో ప్రియంకా చతుర్వేది, జ్యోతిరాదిత్య సిండియా వంటి వాళ్లు ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.

Sanjay Jha Tweet:

ఇదిలా ఉంటే ముంబైలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. పోలీసులను, బస్సు డ్రైవర్లు, కండెక్టర్లను ఎవ్వరినీ వదలడం లేదు. అధికారిక లెక్కల ప్రకారం బెస్ట్‌ పబ్లిక్‌ బస్‌ సర్వీసెస్‌కు చెందిన 128 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. 63 మంది కోలుకున్నారు. ఎనిమిది మంది మరణించారు. 971 మంది క్వారెంటైన్‌ పూర్తి చేసుకొని తిరిగి విధుల్లో చేరగా, మరో వెయ్యి మంది క్వారెంటైన్‌లో ఉన్నారు. కరోనా వైరస్‌ బారిన పడి తమ సిబ్బంది కనీసం 19 మంది చనిపోయి ఉంటారని, కరోనా బారిన పడిన వారి సంఖ్య అధికారులు చెబుతున్న 128 కన్నా ఎక్కువే ఉంటుందని బెస్ట్‌ వర్కర్స్‌ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి