New Delhi, June 08: భారత టాప్ మహిళా సైక్లిస్ట్ (cyclist) చేసిన ఆరోపణలు క్రీడారంగంలో సంచలనం రేపుతున్నాయి. భారత సైక్లింగ్ జాతీయ కోచ్ ఆర్‌కే శర్మపై ( RK Sharma) ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆర్‌కే శర్మ తనను తన గదికి బలవంతంగా లాక్కెళ్లి.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)కి ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. విషయంలోకి వెళితే.. స్లోవేనియాలో (Slovenia) జరుగుతున్న సైక్లింగ్ పోటీలకు భారత సైక్లింగ్ టీమ్‌లో ఐదురుగు పురుషులు, ఓ మహిళా సైక్లిస్ట్ (cyclist) వెళ్లారు. వాస్తవానికి స్లోవేనియాలో భారత జట్టుకి మహిళా కోచ్‌లు ఎవ్వరూ అందుబాటులో లేరు. దీంతో ఆర్‌కే శర్మ సదరు మహిళకు కూడా కోచ్‌గా వ్యవహరించారు.
The Sports Authority of India (@Media_SAI) terminated the contract of the cycling coach for his alleged inappropriate behaviour with a national level cyclist during a foreign exposure trip in Slovenia. pic.twitter.com/7qPVOUHTK4
— IANS (@ians_india) June 8, 2022
ఈ నేపథ్యంలోనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. గదిలోకి లాక్కెళ్లి తనకు బార్యగా ఉండాలని పేర్కొంటూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కాగా భారత జట్టు సైక్లింగ్ పోటీల్లో పాల్గొని జూన్ 14న స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ టూర్‌ని మధ్యలోనే రద్దు చేసుకుని, వెనక్కి రావాల్సిందిగా సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మెన్ ఓంకార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనపై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సీఎఫ్‌ఐ (CFI) కలిసి రెండు ప్యానెల్స్‌తో విచారణ నిర్వహిస్తున్నాయి. ‘అథ్లెట్ ఫిర్యాదును స్వీకరించిన వెంటనే ఆమె భద్రత దృష్ట్యా, సైక్లింగ్ బృందాన్ని స్వదేశానికి రప్పించడం జరిగింది. కమిటీ ఈ విషయంపై పూర్తి విచారణ చేయనుంది. అతి త్వరలో నిజాలను నిగ్గు తేల్చి, బాధితురాలికి న్యాయం చేస్తాం.’ అని సాయ్ అధికారులు తెలిపారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్‌కే శర్మ ఇప్పటిదాకా స్వదేశానికి చేరుకోలేదు. త్వరలోనే అతన్ని స్లోవేనియా నుంచి స్వదేశానికి రప్పించి, నోటీసులు జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు.