COVID-19 Outbreak in India | File Photo

Gandhi Nagar, Dec 22: చైనాలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌.7 కల్లోలం రేపుతున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్‌కు సంబంధించి భారత్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి.తాజాగా మూడు రోజుల క్రితం చైనా నుంచి గుజరాత్ కు వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన 34 ఏళ్ల వ్యాపారవేత్తకు పాజిటివ్‌గా తేలగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. అతడి నమూనాలను గాంధీనగర్‌లోని పరిశోధన కేంద్రానికి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు.

దేశంలో 10 రకాల కరోనా వేరియంట్లు, కోవిడ్ పరిస్థితులపై అధికారులతో ముగిసిన ప్రధాని మోదీ కీలక భేటీ, దేశంలో నాలుగు BF.7 Omicron సబ్-వేరియంట్ కేసులు నమోదు

ఈ బిజినెస్‌ మ్యాన్‌ తన వ్యాపార నిమిత్తం ఇటీవలే చైనాకు వెళ్లారు. డిసెంబర్‌ 19 భారత్‌కు తిరిగివచ్చారు. కోవిడ్‌ కేసుల పెరుగుదల ఆందోళన నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని గుజరాత్‌ ఆరోగ్య శాఖ మంత్రి రుషికేశ్‌ పటేల్‌ ఆదేశించారు. దీంతో భావ్‌నగర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా తేలటం ఆందోళన కలిగిస్తోంది.