New Delhi, November 4: ఇప్పటి వరకు దేశంలో 83,13,000 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశం మొత్తం మీద 46,253 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 514 మంది మృతి (Coivd Deaths) చెందారు. ఇదిలా వుండగా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల కంటే డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,357 మంది డిశార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,33,787 కేసులు నమోదయ్యాయి.
ఇక మొత్తం ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయినవారు 76,56,478 మంది ఉన్నారు. ఇక ఈ వైరస్ సోకి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 1,23,611 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా రికవరీ రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంది. దేశంలో కరోనా రికవరీ రేటు 92.09 శాతంగా (COVID-19 Recovery Rate) ఉంది. దేశంలో నమోదయిన కేసులలో మొత్తం యాక్టివ్ కేసులు కేవలం 6.42 శాతం మాత్రమే. ఈ మరణాల శాతం మొత్తం నమోదయిన కేసులలో 1.49 శాతంగా ఉన్నాయి.
దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం మంగళవారం మొత్తం 59,540 మందికి కరోనా టెస్టులు చేయగా, వారిలో 6,725 మందిని పాజిటివ్‌గా గుర్తించారు. అంటే మొత్తం టెస్టులలో 11.29 శాతం మేరకు కరోనా వైరస్ ఉన్నట్లు స్పష్టమయ్యింది. దీంతో ఇప్పటివరకూ 8.36గా ఉన్న కరోనా పాజిటివ్ రేటు 11.29కి చేరుకుంది. కాగా ఇదే సమయంలో ఢిల్లీలో 3,610 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఢిల్లీలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,60,069కి చేరింది. గడచిన 24 గంటల్లో ఈ వైరస్ కారణంగా 48 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,652కు చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం 36,375 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తగ్గడం, చలి పెరగడం, పండుగల వాతావరణం ఇవన్నీ కరోనా కేసుల పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో తిరిగి రోజుకు 12 వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మరింత అప్రమత్తమై, కరోనా కట్టడి చర్యలను మరింత కఠినంగా చర్యలు అమలు చేసేందుకు సన్నద్ధమయ్యింది. అలాగే కరోనా బాధితుల కోసం మరిన్ని పడకలను ఏర్పాటు చేసేందుకు సమాలోచనలను జరుపుతోంది.