Coronavirus Outbreak in India . |(Photo Credits: PTI)

New Delhi, May 15: దేశంలో కరోనా వైరకోవిడ్ 19 కట్టడికి (COVID-19 in India) కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా పాజిటివ్‌ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,967 పాజిటివ్ కేసులతో (New COVID-19 Patients) పాటు, వైరస్‌ సోకి 100 మంది మృతి చెందారు.

దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య (Coronavirus in India) 81,970కి చేరుకోగా, ఇప్పటి వరకు 2,649 మంది మృత్యువాత పడ్డారు. ఇక వైరస్‌ నుంచి కోలుకుని ఇప్పటివరకు 27,920 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం భారత్‌లో 51,401 యాక్టివ్ కేసులు కేసులు ఉన్నాయి.  దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు, వన్ నేషన్,వన్ కార్డు అమల్లోకి.., రేషన్ కార్డుదారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ

అత్యధికంగా మహారాష్ట్రలో 27,524 కేసులు నమోదు కాగా, 1,019 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 9,674(మృతులు 66), గుజరాత్‌లో 9,592(మృతులు 586), ఢిల్లీలో 8,470(మృతులు 115), రాజస్థాన్‌లో 4,589(మృతులు 125), మధ్యప్రదేశ్‌లో 4,426(మృతులు 237), ఉత్తరప్రదేశ్‌లో 3,902(మృతులు 88), వెస్ట్‌ బెంగాల్‌లో 3,902(మృతులు 215), ఏపీలో 2,205(మృతులు 48), పంజాబ్‌లో 1,935(మృతులు 32), తెలంగాణలో 1,414(మృతులు 34) పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.  వలస కార్మికులకు 2 నెలలు ఉచిత భోజనం, 3 పూటల భోజనానికి రూ.3500 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, వివరాలను వెల్లడించిన ఆర్థిక మంత్రి సీతారామన్

మొత్తంగా చూసుకుంటే మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇక కేరళలోనూ కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

COVID-19 State-Wise Status:

S. No. Name of State / UT Total Confirmed cases* Cured/Discharged/Migrated Deaths**
1 Andaman and Nicobar Islands 33 33 0
2 Andhra Pradesh 2205 1192 48
3 Arunachal Pradesh 1 1 0
4 Assam 87 39 2
5 Bihar 994 411 7
6 Chandigarh 191 37 3
7 Chhattisgarh 60 56 0
8 Dadar Nagar Haveli 1 0 0
9 Delhi 8470 3045 115
10 Goa 14 7 0
11 Gujarat 9591 3753 586
12 Haryana 818 439 11
13 Himachal Pradesh 74 39 2
14 Jammu and Kashmir 983 485 11
15 Jharkhand 197 87 3
16 Karnataka 987 460 35
17 Kerala 560 491 4
18 Ladakh 43 22 0
19 Madhya Pradesh 4426 2171 237
20 Maharashtra 27524 6059 1019
21 Manipur 3 2 0
22 Meghalaya 13 11 1
23 Mizoram 1 1 0
24 Odisha 611 158 3
25 Puducherry 13 9 1
26 Punjab 1935 223 32
27 Rajasthan 4534 2580 125
28 Tamil Nadu 9674 2240 66
29 Telengana 1414 950 34
30 Tripura 156 29 0
31 Uttarakhand 78 50 1
32 Uttar Pradesh 3902 2072 88
33 West Bengal 2377 768 215
Total number of confirmed cases in India 81970# 27920 2649

అక్కడ తాజాగా మరో 26 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడం, వలస కూలీల తరలింపు, విదేశాల నుంచి స్వదేశానికి ప్రయాణికులను తరలించడం మూలంగానే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది.