Finance Minister Nirmala Sitharaman | (Photo Credits: ANI)

New Delhi, May 14: భారతదేశంలోని ఎక్కడైనా కార్మికులు ప్రజా పంపిణీ వ్యవస్థను పొందటానికి వీలుగా 'వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్' పథకం (One Nation, One Ration Card Scheme) కింద వలస కార్మికులను చేర్చుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (FM Nirmala Sitharaman) గురువారం చెప్పారు. 2021 మార్చి నాటికి 'వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్' (One Nation,One Ration Card)పథకాన్ని 100 శాతం అమలు చేస్తామని నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. వలస కార్మికులకు 2 నెలలు ఉచిత భోజనం, 3 పూటల భోజనానికి రూ.3500 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, వివరాలను వెల్లడించిన ఆర్థిక మంత్రి సీతారామన్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు మీడియా సమావేశం నిర్వహించారు. మొదటి రోజు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల(ఎమ్ఎస్ఎంఈ)కు ప్రోత్సాహం గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ఇక రెండో సమావేశంలో గ్రామీణ ఆర్థికం, వలస కూలీల సమస్యలు, రైతులు సమస్యలపై దృష్టి సారించారు.

'One Nation, One Ration Card' Scheme Announced For Migrants:

ప్రధానంగా ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ (ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు) విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నాటికి దేశ వ్యాప్తంగా దీనిని అమలు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక నుంచి రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు దేశంలో ఏ ప్రాంతంలోనైనా రేషన్ తీసుకోవచ్చు. ఈ విధానాన్ని పోర్టెబులిటీ అంటారు.  రైతులకు మే 31 వరకు వడ్డీ రాయితీ, రైతులు,వలస కూలీలు,చిన్న వ్యాపారులకు ప్యాకేజీ ద్వారా ఎంతో లబ్ది, 9 విభాగాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి

అంటే ఏపీకు చెందిన వ్యక్తి ముంబైలో నివాసం ఉంటున్నట్లయితే.. అక్కడే రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మద్య ఈ విధానం అమలులో ఉంది. ఇది ఇకపై దేశ వ్యాప్తంగా అమలు కానుంది. ఈ నూతన విధానం వల్ల 23 రాష్ట్రాల్లోని 67 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కగలనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగమైన 83 శాతం మందికి ఇది ప్రత్యక్షంగా ఉపయోగ పడుతుందని అన్నారు.  ఎంఎస్‌ఎంఈలకు కొత్త అర్థం,ఈపీఎఫ్ చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు, రూ. 20 కోట్ల ఆర్థిక ప్యాకేజీ పూర్తి వివరాలు ఇవే

రేషన్ కార్డు దారులందరికీ ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయనున్నారు. ఈ స్కీములో భాగంగా ఒక్కో వ్యక్తి 5 కిలోల చొప్పున బియ్యం, గోధుమలు పొందుతారు. ఒక్కో కార్డుపై కిలో పప్పు ధాన్యాలు, బియ్యం, గోధుమలు పొందవచ్చు. వలస కార్మికులు ఎక్కడ ఉన్నా కార్డు లేకున్నా ఉచితంగా ఆహార ధాన్యాలు పొందవచ్చు. రేషన్ కార్డు దారులందరికీ ఉచితంగా రెండు నెలలు ఆహార ధాన్యాలు సరఫరా చేస్తామని తెలిపారు. ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం రేషన్ కార్డు పోర్టెబులిటీ తీసుకురానున్నట్లు తెలిపారు. ఆగస్టు 1 నాటికి దేశ వ్యాప్తంగా ఒకే కార్డు విధానం అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం 63 కోట్ల మందికి ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందని ఆర్థికమంత్రి అన్నారు.