
New Delhi, Mar 17: కరోనా (coronavirus) ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనా వైరస్ దెబ్బకి ( coronavirus Outbreak) వణికిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 7వేలకు పైగా చేరింది. మన దేశంలో కరోనా కేసులు 125కు పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఒక ముఖ్యమైన సందేశం పంపింది. ఈ సందేశం ప్రకారం బ్యాంకులకు ఎవరూ రావద్దని కోరింది. డిజిటల్ సేవలు (SBI digital channels) వినియోగించుకోవాలని తెలిపింది.
కాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రీసెంట్ గా బ్యాంకింగ్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్ల కోసం SBI Yono (యూ నీడ్ ఓన్లీ వన్) అనే పేరుతో కొత్త యాప్‌ను అందుబాటలోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ యాప్‌ను ఉపయోగించమని మార్చి 16న బ్యాంక్ ఖాతాదారులకు మెసేజ్‌లు పంపింది. కోవిడ్ 19 (COVID-19) వైరస్ కారణంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ల కోసం బ్యాంక్ డిజిటల్ ఛానల్స్ ఉపయోగించండి అని SBI యూజర్లకు పంపిన మెసేజ్‌లో పేర్కొంది.
వడ్డీ రేట్లను తగ్గించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌కు అదనంగా యాప్ ద్వారా ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్‌ను ఆపరేట్ చేయొచ్చని ఎస్‌బీఐ (State Bank of India) పేర్కొంది. సొంత అకౌంట్ లేదా ఇతరుల అకౌంట్‌కు డబ్బులు పంపొచ్చని... దీని కోసం బ్యాంకుకు రావాల్సిన అసవరం లేదని తెలిపింది. మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, నెట్ బ్యాంకింగ్ మాత్రమే కాకుండా ఫోన్ బ్యాంకింగ్ ద్వారా కూడా బ్యాంక్ కస్టమర్లు బ్యాంకింగ్ సర్వీసులు పొందొచ్చని తెలిపింది.