Pawan Kalyan: కరోనావైరస్‌పై పోరాటానికి రూ. 2 కోట్లు డొనేట్ చేసిన పవన్ కళ్యాణ్, రూ. 71 లక్షలు విరాళమిచ్చిన రామ్ చరణ్ తేజ్,  బాధ్యతగా విరాళాలు అందజేస్తున్న ప్రముఖులు
Janasena Cheif Pawan Kalyan | File Photo.

Hyderabad, March 26: దేశవ్యాప్తంగా కోవిడ్ 19 కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనావైరస్ మహమ్మారిపై పోరాటం కోసం సినీనటుడు, జనసేన అధినేత (Janasena Chief) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  తనవంతుగా రూ. 2 కోట్లు విరాళాన్ని (Relief Fund) ప్రకటించారు. ఇందులో ప్రధానమంత్రి సహాయ నిధి కోసం రూ. 1 కోటి అలాగే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్లకు రూ. 50 లక్షల చొప్పున మరొక కోటి రూపాయలు విరాళంగా అందజేస్తున్నట్లు జనసేనాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

అంతకుందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త కర్ఫ్యూను తాను మనస్పూర్థిగా స్వాగతిస్తున్నట్లు పవన్ చెప్పారు. కరోనావైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటించాలని ఇందుకు వేరే దారిలేదని ఆయన చెప్పారు. అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని పవన్ పిలుపునిచ్చారు.

Here's Pawan Kalyan tweet:

;

2)

ఏదిఏమైనా కోవిడ్ 19 పోరాటం కోసం వివిధ రంగాలలోని ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా వచ్చి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధులకు తమవంతుగా సహాయసహాకారాలను అందించడం ప్రశంసించదగిన విషయం.

పవన్ కళ్యాణ్ తర్వాత, రామ్ చరణ్ తేజ్ తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు కలిపి రూ. 71 లక్షలను విరాళంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు రాష్ట్రాలకు రూ. 10 లక్షల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. ఇటీవల హీరో నితిన్ కూడా రూ. 10 లక్షల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందించారు.

ఇదిలా ఉండగా, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్ లోని 'పింక్' చిత్రం ఆధారంగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వకీల్ సాబ్‌తో పాటు, పవన్ కళ్యాణ్ దర్శకులు క్రిష్ మరియు హరీష్ శంకర్ తెరకెక్కించే సినిమాలలో కూడా భాగస్వామ్యం అయినట్లు సమాచారం.