New Delhi, April 21: దేశ వ్యాప్తంగా వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్సను అందిస్తున్నారు. కరోనా మహమ్మారి (Coronavirus Pandemic) అంటువ్యాధిలా వారిని కబలిస్తుందని తెలిసినా ప్రాణాలకు తెగించి చికిత్స చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం వైద్యులపై దాడులకు (attacks on doctors) పాల్పడుతున్నారు. కరోనా పోరులో వైద్య సిబ్బంది మరణిస్తే రూ.50 లక్షలు, కీలక నిర్ణయం తీసుకున్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం, చనిపోయిన వైద్య సిబ్బందికి అమరవీరుల గుర్తింపు హోదా
వైద్యులపై ఉమ్మివేస్తూ, దుర్భాషలాడుతూ వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈనెల 23న బ్లాక్‌డే (IMA declares 23 April as Black Day) పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) (Indian Medical Association) నిర్ణయించింది. వైద్యలుపై దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22 రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో క్యాండిల్స్ వెలిగించి నిరసన తెలపాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజన్ శర్మ, గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్వీ అశోకన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Here's the ANI tweet on the above news:
If the govt fails to enact Central Law on violence against Doctors & Hospitals even after White Alert, IMA will declare Black Day on 23rd April. All doctors in the country will work with black badges: Indian Medical Association pic.twitter.com/9z1KAsflcO
— ANI (@ANI) April 20, 2020
దీని ప్రకారం డాక్టర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి 23వ తేదీన విధులకు హాజరు కావాలని సూచించారు. వైద్యులకు రక్షణగా ఓ చట్టాన్ని రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. తమిళనాడులో కరోనా కారణంగా ఓ వైద్యుడు చనిపోతే అతని అంత్యక్రియలకు స్థానికులు అడ్డుతగిలారు. అంతేకాకుండా వారిపై రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఈ విషయాన్ని మరో డాక్టర్ వీడియో ద్వారా బయటకు తెలియజేయడంతో వార్త వైరల్ అయింది. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమన్నారు.
కరోనా కట్టడికోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులపై దాడులకు పాల్పడటం అన్నది అత్యంత హేయమైన చర్య. వారి శ్రమను గుర్తించకుండా వారిపై దాడులకు పాల్పడుతున్నారు. సరే మేం కూడా ఇంట్లో కూర్చుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.
అపోహలు సృష్టిస్తూ దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది.ఈ నేపథ్యంలోనే బ్లాక్ డే పాటించాలని వైద్యులకు సూచించింది.