China Response on ICMR’s Decision: చైనా ర్యాపిడ్ కిట్ల వ్యవహారం, ఒక్క రూపాయి చెల్లించబోమన్న ఇండియా, మా గుడ్‌విల్‌ను భారత్ గౌరవిస్తుందని తెలిపిన చైనా
Coronavirus outbreak in India (Photo Credits: IANS)

New Delhi, April 28: ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టుల కచ్చితత్వంపై రాష్ట్రాలు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో చైనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను (China Rapid Test Kits) ఇక నుంచీ వాడరాదని రాష్ట్రాలను ఐసీఎంఆర్‌ ( ICMR) ఆదేశించిన సంగతి విదితమే. కాగా భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సూచనలపై చైనా (China Response on ICMR’s Decision) స్పందించింది. వైద్య పరికరాల నాణ్యత విషయంలో పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొంది. చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లను వాడవద్దు, వెంటనే చైనాకు వాటిని తిరిగి పంపండి, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఐసీఎమ్ఆర్

చైనా నుంచి దిగుమతి చేసుకున్న రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల పనితీరుపై సందేహాలు తలెత్తిన నేపథ్యంలో ఐసీఎంఆర్‌తో (Indian Council of Medical Research (ICMR) చైనా రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది. ఈ క్రమంలో త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించి.. తదనుగుణంగా చర్యలు తీసుకునేందుకు ఆ రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు చైనా రాయబారి జీ రోంగ్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో 29 వేలు దాటిన కరోనా కేసులు, మహారాష్ట్రలోనే 8 వేలకు పైగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు, ఢిల్లీలో 3 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

గువాంగ్‌జో వండ్ఫో బయోటెక్‌, జుహాయ్‌ లివ్సోన్‌ డయాగ్నస్టిక్స్‌ అనే రెండు చైనా కంపెనీలకు చెందిన రాపిడ్‌ టెస్టింటు కిట్లు కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు ఇవ్వడం లేదని ఐసీఎంఆర్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ రెండు కంపెనీల నుంచి కిట్లు కొనవద్దని, ఒకవేళ ఇప్పటికే వాటిని ఉపయోగిస్తున్నట్లయితే వాడకం ఆపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కాగా సదరు కంపెనీలకు ఇంతవరకు చెల్లింపులు జరుపలేదని.. ఇకపై ఒక్క పైసా కూడా చెల్లించబోమని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

Here's Wondfo Tweet

Here's ANI Tweet

ఇటువంటి పరిణామాల నేపథ్యంలో చైనా వెంటనే అలర్టయింది. ఈ విషయంపై స్పందించిన చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జీ రోంగ్‌ ఆ రెండు కంపెనీల టెస్టింగ్‌ కిట్లకు చైనా జాతీయ వైద్య ఉత్పత్తుల పాలనావిభాగం(ఎన్‌ఎంపీఏ) నుంచి సర్టిఫికేషన్‌ లభించిందని పేర్కొన్నారు. రాపిట్‌ టెస్టింగ్‌ కిట్ల స్టోరేజీ, రవాణా, వాడకంలో జాగ్రత్తలు పాటించకపోయినట్లయితే అది కిట్‌ పనితీరుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. చైనా గుడ్‌విల్‌, సిన్సియారిటీని భారత్‌ గౌరవిస్తుందని ఆశిస్తున్నాం. వాస్తవాలను గమనించి చైనా కంపెనీలతో మాట్లాడి సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.  చైనా నాసిరకం కిట్లకు డబ్బులు చెల్లించలేదు, ఆ కిట్లను వెనక్కి పంపిస్తాం, ఇండియాలో కరోనా వ్యాప్తి చాలా తక్కువ, మీడియాతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్

వైరస్‌లు మానవాళి ఉమ్మడి శత్రువులు. మనమంతా ఒక్కటిగా పోరాడితేనే కోవిడ్‌-19పై విజయం సాధించగలం. ఈ పోరులో బారత్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం. సమస్యలు అధిగమించేందుకు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వారికి తోడుగా నిలుస్తాం’’అని జీ రోంగ్‌ వ్యాఖ్యానించారు.