COVID-19 in India: భారత్‌లో 694కి చేరిన కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాలలో అత్యధికం, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 కరోనా మరణాలు నమోదు
Coronavirus Outbreak in India | (Photo Credits: PTI)

New Delhi, March 26:  భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల (COVID-19 in India) సంఖ్య గురువారం ఉదయం నాటికి 649 కు పెరిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం, మొత్తం కేసులలో ప్రస్తుతం 593 యాక్టివ్ కేసులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. అత్యధిక కేసులు మహారాష్ట్రలో (Maharashtra) 124 కేసులు, కేరళలో (Kerala) 118 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో 41, ఆంధ్రప్రదేశ్ లో 10 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 కోవిడ్-19 మరణాలు (Coronavirus Deaths) సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. అయితే గురువారం రాత్రి వరకు  దేశంలో పాజిటివ్ కేసులు 694 కు చేరాయి.

COVID-19 కారణంగా తాజాగా శ్రీనగర్‌లోని హైదర్‌పోరా నుంచి నమోదైంది. దీంతో మరణాల సంఖ్య 14 కు చేరినట్లయింది. గురువారం 65 ఏళ్ల వ్యక్తి గురువారం చికిత్స పొందుతూ చనిపోయారు. ఇదే జమ్మూ కాశ్మీర్ నుంచి నమోదైన తొలి కరోనావైరస్ పాజిటివ్ కేసు. ఈ చనిపోయిన వ్యక్తి ద్వారా ఇప్పటికే నలుగురికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ వ్యక్తి దిల్లీ, ఉత్తర ప్రదేశ్, జమ్మూ, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో సంచరించినట్లు నివేదికలు వెల్లడించాయి.

గుజరాత్ లో బుధవారం రెండవ మరణం నమోదైంది. ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించి వచ్చిన 85 ఏళ్ల మహిళ అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక ఇప్పటివరకు నమోదైన కోవిడ్ 19 మరణాలలను గమనిస్తే మహారాష్ట్ర నుంచి 3, గుజరాత్ నుంచి 2, పశ్చిమ బెంగాల్, బీహార్, దిల్లీ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.

భారతదేశంలో COVID-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ మహమ్మారిపై పోరాడటానికి 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ కు పిలుపునిచ్చారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యగా భారతదేశంలోని ప్రతి రాష్ట్రం, జిల్లా మరియు గ్రామం లాక్డౌన్ అమలవుతుందని ప్రధాని స్పష్టం చేశారు