COVID-19 in Karnataka: రెండు డోసులు తీసుకున్నా కరోనా డేంజర్ బెల్స్, ఎస్‌డీఎం మెడిక‌ల్ కాలేజీలో 182 మంది వైద్య విద్యార్థులకు కరోనా, క్వారంటైన్ లో విద్యార్థులు
Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

Bengaluru, Nov 26: క‌ర్ణాట‌క రాష్ట్రం ధార్వాడ్‌లోని ఎస్‌డీఎం మెడిక‌ల్ కాలేజీలో క‌రోనావైరస్ మ‌హమ్మారి (COVID-19 in Karnataka) క‌ల‌క‌లం రేపింది. ఆ కాలేజీలో 300 మంది విద్యార్థులు, సిబ్బందికి గురువారం క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 66 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దాంతో అప్రమ‌త్త‌మైన అధికారులు ఇవాళ మ‌రికొంద‌రు విద్యార్థులు, సిబ్బందికి కూడా ప‌రీక్ష‌లు చేశారు. దాంతో కాలేజీలో క‌రోనా బారిన‌ప‌డ్డ మొత్తం విద్యార్థుల సంఖ్య 182కు (Cases at SDM Medical College Rise to 182) చేరింది.

అయితే, ఈ నెల 17న కాలేజీలో నిర్వ‌హించిన ఫ్రెష‌ర్స్ పార్టీయే ఇప్పుడు మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ‌కు కార‌ణ‌మ‌ని ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. కాగా, ప్ర‌స్తుతం క‌రోనా బారిన‌ప‌డిన విద్యార్థులు, సిబ్బందిలో సగానికిపైగా రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్త‌యిన వారు ఉన్నార‌ని క‌ర్ణాట‌క హెల్త్ క‌మిష‌న‌ర్ డీ ర‌ణ‌దీప్ చెప్పారు. బాధితుల్లో కొత్త వేరియంట్ ఏదైనా ఉందేమో అనే సందేహంతో కొంత‌మంది శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

కొంపముంచిన కాలేజీ ఫెస్టివల్, 66మంది మెడికల్ స్టూడెంట్స్‌ కు కరోనా పాజిటివ్, 400 మంది విద్యార్ధులకు టెస్టులు

కరోనా బారిన పడటంతో కాలేజీకి చెందిన రెండు హాస్టళ్లను మూసేశారు. మెడికల్ కాలేజీలో తరగతులను రద్దు చేశారు. కరోనా బారిన పడిన విద్యార్థులను హాస్టల్ లోనే క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేయిస్తున్నామని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితీష్ పాటిల్ తెలిపారు. మరోవైపు బెంగళూరు సిటీలోని ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్లో 33 మంది విద్యార్థులతో పాటు ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకింది.