Coronavirus outbreak | (Photo Credits: IANS)

New Delhi, June 23: భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 50,848 కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 1,358 మంది కోవిడ్‌ బాధితులు మృతి (Covid Deaths)చెందారు. దీంతో కరోనా వైరస్‌ బారినపడి మొత్తం 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 68,817 మంది కోవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.

దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,89,94,855 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 6,43,194 కరోనా పాజిటివ్‌ కేసులు (Covid in India) ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,00,28,709 మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 54,24,374 మంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. దీంతో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య 29,46,39,511కు చేరుకుంది. గత 24 గంటల్లో 19,01,056 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో కరోనా రికవరీ రేటు 96.56 శాతం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో రోజువారీ క‌రోనా వ్యాప్తి రేటు 2.67 శాతానికి పడిపోయింది.

ఇది మరో షాక్ లాంటి వార్తే.. సైన్స్‌లో అత్యుత్తమ అవార్డుకు ఎంపికైన వుహాన్ ల్యాబ్‌, ప్రత్యేక అభినందనలు అందుకున్న వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ హెడ్ షి జెంగ్లీ, వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకయిందంటూ ఇప్పటికీ వినిపిస్తున్న వార్తలు

కరోనాకు వ్యతిరేకంగా సాగుతున్న టీకా డ్రైవ్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు ఇచ్చిన టీకాల సంఖ్య 29కోట్లు దాటింది. మంగళవారం రాత్రి 7 గంటల వరకు అందించిన తాత్కాలిక సమాచారం మేరకు మొత్తం 29,40,42,822 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం ఒకే రోజు 48 లక్షలకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. 18-44 ఏజ్‌గ్రూప్‌లో ఒకే రోజు 32,81,562 మంది లబ్ధిదారులకు మొదటి డోస్‌, మరో 71,655 మంది రెండో డోసు తీసుకున్నారని పేర్కొంది.

మూడో దశలో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6,55,38,687 మంది లబ్ధిదారులకు మొదటి, మరో 14,24,612 రెండో మోతాదు వేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పది లక్షలకుపైగా ఏజ్‌గ్రూప్‌లో టీకాలు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.