New Delhi, Mar 18: దేశంలో కరోనా (Covid-19) కల్లోలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ధాటికి (coronavirus outbreak) ప్రపంచ ఆర్థికవృద్ధి అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో దాని ప్రభావం ఇండియా మీద తీవ్ర స్థాయిలో ఉంది. ఇండియాలో ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు ఆర్‌బిఐ తగు చర్యలు చేపట్టింది.
యెస్ బ్యాంకులో ఉన్న ప్రజల సొమ్ము భద్రం
ఇందులో భాగంగా ఓయంవో (OMO) (ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్)ద్వారా పది వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను(government bonds) కొనుగోలు చేయనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి, రెండు నుంచి ఐదు సంవత్సరాల మధ్య టేనర్‌తో మొత్తం రూ.10,000 కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలును మార్చి 20న ప్రారంభిస్తామని ఆర్‌బిఐ తెలిపింది.
అన్ని మార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యమని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌బీఐ బాండ్ కొనుగోలు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే బెంచ్‌మార్క్ పదేళ్ల బాండ్ దిగుబడి 6.24 శాతానికి పడిపోయింది. మరోవైపు తాజా నిర్ణయంతో ఆర్‌బీఐ 125 పాయింట్లమేర కీలక వడ్డీరేట్ల కోత పెట్టనుందన్న అంచనాలకు మరింత బలాన్నిస్తోంది.
యస్ బ్యాంక్ సంక్షోభంపై ఆందోళన వద్దు
కాగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గిస్తామన్న సంకేతాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇచ్చింది. ఏప్రిల్ ద్రవ్య సమీక్షలో కోతలకు అవకాశాలున్నాయన్న రీతిలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించారు. దేశీయ స్టాక్ మార్కెట్ల భారీ పతనం, యెస్ బ్యాంక్ సంక్షోభం, భారత ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి వాటి మధ్య ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎలాంటి ఆర్థిక విపత్తులనైనా ఎదుర్కొనే సత్తా ఆర్బీఐకి ఉందన్నారు. అందుకు తగిన విధాన నిర్ణయాలు ఆర్బీఐ తీసుకోగలదని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితం ఏప్రిల్ 3న విడుదల కానున్నది.
యెస్ బ్యాంక్‌కు ఆర్బీఐ అన్ని రకాలుగా అండగా ఉంటుందన్న దాస్.. బ్యాంక్ పునరుద్ధరణ ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నదని వివరించారు. 18 నుంచి మారటోరియం ఎత్తివేస్తామన్నారు. రూ.25వేల కోట్ల కోసం 5 విడుత లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ (ఎల్టీఆర్‌వో)ను ఆర్బీఐ చేపట్టనున్నది .