New Delhi, September 24: భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రావడం లేదు. ప్రతిరోజు వేలల్లో నమోదవుతున్న కొత్త కేసులతో దేశంలో కొవిడ్ బాధితుల సంఖ్య 57 లక్షలు దాటింది. నెలలు గడుస్తున్నా ఈ వైరస్ కు వ్యాక్సిన్ మాత్రం ఇప్పటికీ కనుచూపుమేరలో కనిపించడం లేదు. మరోవైపు ప్రజల్లో కూడా ఇటీవల కాలంగా కొవిడ్ పట్ల ఎలాంటి భయం కనిపించడం లేదు, కొవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతూనే పోతుంది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 86,508 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 5,732,519కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,129 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 91,149 కు పెరిగింది.
మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకొని ప్రతిరోజు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ఒక్కటే ప్రస్తుతం కొంత ఊరటనిచ్చే విషయం. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో 87,375 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 46,74,988 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 9,66,382 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Here's the update:
India's #COVID19 case tally crosses 57-lakh mark with a spike of 86,508 new cases & 1,129 deaths in last 24 hours.
The total case tally stands at 5,732,519 including 9,66,382 active cases, 46,74,988 cured/discharged/migrated & 91,149 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/pTxY0gg99Y
— ANI (@ANI) September 24, 2020
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 81.25% ఉండగా, మరణాల రేటు కేవలం 1.59% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
ఇక సెప్టెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా 6,74,36,031 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,56,569 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది. కరోనాతో కేంద్ర మంత్రి సురేశ్ అంగడి కన్నుమూత, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
ఇక కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 21,029 పాజిటివ్ కేసులు మరియు 479 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 12,63,799కు చేరగా మరణాల సంఖ్య 33,886కు పెరిగింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య గురువారం 31.7 మిలియన్ల మార్కును దాటాయి, అలాగే మరణాలు 9,75,000 దాటినట్లు నివేదికలు పేర్కొన్నాయి.