Image used for representational purpose (Photo Credits: IANS)

Pune, September 29: దేశంలో కరోనా వైరస్‌ కోరలు చాచిన నేపథ్యంలో దేశీయ ఔషద సంస్థలన్నీ వ్యాక్సిన్‌ తయారీ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సిరమ్ ఇనిస్టిట్యూట్ (Serum Institute of India) కీలక ప్రకటన చేసింది. 2021 ఆరంభంలోనే 10 కోట్ల డోసుల అదనపు కోవిడ్ వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. తొలి విడతలోనే మధ్యతరగతి వర్గాల వారికి వ్యాక్సిన్ అందించే దిశగా చర్యలు తీసుకుంటామని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

కాగా బిల్‌గేట్స్ అండ్ మిలంద్‌ గేట్స్ ఫౌండేషన్‌తో (Bill and Melinda Gates Foundation) కలిసి వ్యాక్సిన్ ఉత్పత్తికి సిరమ్‌ శ్రీకారం చుట్టింది. సీరం నుంచి బయటకు వచ్చే ఒక్కో డోసు రూ.250 ఉండే విధంగా.. మధ్యతరగతివారికి మిలంద్‌గేట్స్ ఫౌండేషన్ ద్వారా అందించనుంది. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సిరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

తాజాగా 70,589 మందికి కరోనా, దేశంలో 61 లక్షల 45 వేలకు పెరిగిన కోవిడ్ కేసుల సంఖ్య, 776 మంది మృతితో 96,318కు చేరిన మరణాల సంఖ్య

ఇక మరో ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ రూపిందిస్తున్న కోవాగ్జిన్‌ సైతం ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. ఐసీఎంఆర్‌, భారత్‌ బయోటెక్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ కోసం దేశంలోని 12 ప్రయోగ కేంద్రాల్లో ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతికి అదుపులోకి రాకపోవడంతో ప్రపంచ ఔషద సంస్థలన్నీ వ్యాక్సిన్‌ తయారీపై దృష్టిసారించాయి. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ఇప్పటికే మూడో విడత ప్రయోగ దశలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై అశలు పెట్టుకున్నారు.

చైనా నుంచి మరో ప్రమాదకర వైరస్, క్యూలెక్స్‌ దోమ ద్వారా క్యాట్‌ క్యూ వైరస్‌, కర్ణాటకలో ఇద్దరికీ సోకిన సీక్యూవీ, జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరిక

దేశంలో గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 70,589 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 61 లక్షల 45 వేలకు చేరింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా మొత్తం 776 మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా కరోనా (Global Coronavirus) నుంచి కోలుకుని 84,877 డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 96,318 మృతి (Coronavirus Deaths) చెందగా.. మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 51,01,397కి పెరిగింది.

దేశ వ్యాప్తంగా 9,47,576యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 83.01 శాతంగా నమోదైంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 15.42 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 11,42,811 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు చేసిన పరీక్షల సంఖ్య 7,31,10,041. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్‌ బులిటిన్‌ విడుదల చేసింది.