New Delhi, Nov 22: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొన్ని నగరాల్లో సెకండ్ వేవ్ స్టార్ట్ కాగా మరికొన్ని చోట్ల మూడో వేవ్ ప్రారంభం అయింది. ఢిల్లీ వంటి నగరాల్లో మూడవ దశకు చేరిన కరోనావైరస్ తెగ ఆందోళన కలిగిస్తోంది. ఇక పండుగల తర్వాత కరోనా కేసులు పెరు గుతుండటంతో పలు రాష్ట్రాలు ప్రధాన నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నాయి. కఠిన ఆంక్షలు (New Restrictions Imposed in Cities) విధిస్తున్నాయి.
గుజరాత్‌లోని రాజ్‌కోట్, సూరత్, వడోదర నగరాల్లో శనివారం రాత్రి నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. అయితే, కర్ఫ్యూ (Night Curfews) ఎప్పటివరకు అనేది స్పష్టం చేయలేదు. రాజధాని అహ్మదాబాద్‌లో శుక్రవారం రాత్రి నుంచే కర్ఫ్యూ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సహా ఇండోర్, గ్వాలియర్, విదిశ, రత్లాం జిల్లాల్లోనూ శనివారం రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.
ముంబైలో స్కూళ్లను డిసెంబరు 31 వరకు తెరవొద్దని నిర్ణయించారు. మహారాష్ట్రలోని థానె, నవీ ముంబై, పన్వేల్‌లోనూ ఇదే నిర్ణ యం అమలుకానుంది. మిగతా ప్రాంతాల్లో తెరిచేందుకు అనుమతిచ్చినా తప్పనిసరి కాదని ప్రకటించారు. కాగా, ముంబైకి ఢిల్లీ నుంచి విమానాలు, రైళ్ల సర్వీసులు తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. పరిస్థితిని బట్టి బడులు తెరవాలా? వద్దా? అని నిర్ణయించుకోమని గుజరాత్, హరియాణ, మణిపూర్ ప్రభుత్వాలు జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలిచ్చాయి.
ఉత్తర ప్రదేశ్‌లో సెకండ్‌వేవ్ మొదలైనట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌లు పెరగడంతో కేంద్రం అప్రమత్తమైంది. పరీక్షల సంఖ్యను పెంచాలని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
ఇక ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఉన్న లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో శిక్షణ పొందుతున్న 33మంది సివిల్ సర్వీసెస్ అధికారులకు పాజిటివ్ వచ్చింది. ప్రయాణికుల్లో కొందరికి పాజిటివ్ రావడంతో ఎయిరిండియా విమానాల రాకను హాంకాంగ్ ప్రభుత్వం డిసెంబరు 3వ తేదీ వరకు రద్దు చేసింది.