RBI: కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీని మార్చే ఆలోచనేమి లేదు, ఆ వదంతులు నమ్మవద్దని తెలిపిన రిజర్వ్ బ్యాంక్, ఠాగూర్‌తో పాటు అబ్దుల్‌ కలాం ఫొటోలను కరెన్సీపై ముద్రిస్తారని వార్తలు వైరల్
Indian Currency | Representational Image | (Photo Credits: Wikimedia Commons)

భారతీయ కరెన్సీ నోట్లపై మార్పులు చేయాలని ఆర్‌బీఐ యోచిస్తున్నట్లుగా మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి విదితమే. దీనిపై రిజర్వ్ బ్యాంక్ స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం కరెన్సీపై ఉన్న గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. భారతీయ కరెన్సీ నోట్లపై మార్పులు చేయాలని ఆర్‌బీఐ యోచిస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయని.. ఇలాంటి ప్రతిపాదనేదీ లేదని, ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. రూ. 1, రూ.2, ₹5, ₹10, ₹20 నాణేలను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆజాదికా అమృత్ మహోత్సవ్ లోగోతో ప్రత్యేక శ్రేణి కాయిన్స్ విడుదల చేసిన భారత ప్రధాని

ప్రస్తుతం ఉన్న కరెన్సీపై విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌తో పాటు మాజీ రాష్ట్రపతి, మిస్సైల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఫొటోలను కరెన్సీపై ముద్రించేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతుందన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్‌బీఐ త్వరలోనే కీలకమైన ముందడుగు వేయవచ్చని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న భారతీయ కరెన్సీ, నోట్లలో ఎలాంటి మార్పులు చేయాలనే ప్రతిపాదన ఏమీ లేదని, ఇలాంటివి కేవలం ఊహాగానాలేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.