Cyclone Biparjoy Latest News: సైక్లోన్ బిపర్‌జోయ్ రేపు సాయంత్రం గుజరాత్ తీరాన్ని తాకనుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ.. అప్రమత్తత చేస్తూ వస్తోంది.బుధవారం గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో బలమైన గాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా అనేక చెట్లు నేలకూలడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ (IMD) గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీప్ మొదలైన అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వాతావరణ హెచ్చరిక జారీ చేసింది.
గుజరాత్‌లో చేపల వేట కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. జూన్ 16 వరకు, సముద్రం చాలా అల్లకల్లోలంగా మారినందున ఓడరేవులు మూసివేయబడ్డాయి. ఓడలు లంగరు వేయబడ్డాయి. తుఫాను సమీపిస్తున్న కారణంగా ఈ ప్రాంతంలో అత్యంత భారీ వర్షాలు, బలమైన గాలులతో వాతావరణం ప్రతికూలంగా మారింది.ముందస్తు జాగ్రత్తగా గుజరాత్ వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దాదాపు 17 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 12 ఎస్డీఆర్‌ఎఫ్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఎనిమిది రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అతిభారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఇప్పటివరకు గుజరాత్ తీర ప్రాంతాల నుండి 50,000 మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు.
బిపర్‌జోయ్ ఇవాళ పోర్‌బందర్, ద్వారకా వద్ద తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తోంది. రేపు సాయంత్రం జఖావూ పోర్ట్ వద్ద తీరం దాటోచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర-ఈశాన్య దిశగా కదిలే క్రమంలో గురువారం సౌరాష్ట్ర, కచ్‌పై విరుచుకుపడే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దాదాపు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకుతూ.. 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని హెచ్చరించింది.
బిపర్‌జోయ్ తుపాను కారణంగా.. గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీప్‌లకు భారీ నుంచి అతి భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రెండు రోజులపాటు అంటే జూన్ 15 నుంచి 17 మధ్య ఈ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే 38 వేల మందిని సముద్ర తీరం నుంచి ఖాళీ చేయించినట్లు ప్రకటించింది. అయితే ఆ సంఖ్య 44వేలదాకా ఉంటుందని క్షేత్రస్థాయిలోని అధికారులు అంటున్నారు. 1965 నుంచి ఇప్పటిదాకా గుజరాత్‌ను తాకిన మూడో తుపానుగా బిపర్‌జోయ్ నిలవనుంది.
బిపర్‌జోయ్ తుపాను నేపథ్యంలో గుజరాత్ లో తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక కచ్ జిల్లాలోనే 34,000కు పైగా ప్రజలను తరలించారు. వీరికి బీఎస్ఎఫ్ జవాన్లు షెల్టర్ లను నిర్మించారు. ఇక్కడి తొమ్మిది నగరాలను పూర్తిగా మూసివేశారు. సౌరాష్ట్ర - కచ్ సహా వివిధ తీర ప్రాంతాల్లో తీవ్ర గాలులతో భారీ వర్షం కురుస్తోంది. రేపు ద్వారకలోని ద్వారకాదీశ్ అలయాన్ని మూసివేస్తున్నారు.
మరోవైపు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లతో సమీక్షించారు.ముగ్గురు సర్వీస్ చీఫ్‌లతో మాట్లాడి, 'బిపార్జోయ్' తుఫాను తీరం దాటేందుకు సాయుధ బలగాల సంసిద్ధతను సమీక్షించారు. తుఫాను కారణంగా ఏదైనా పరిస్థితి లేదా ఆకస్మిక పరిస్థితిని ఎదుర్కోవడంలో పౌర అధికారులకు సాధ్యమైన ప్రతి సహాయాన్ని అందించడానికి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయి," రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
జూన్ 14, బుధవారం సౌరాష్ట్ర మరియు కచ్‌లోని కచ్, దేవభూమి ద్వారక, పోర్‌బందర్, జామ్‌నగర్, రాజ్‌కోట్, జునాగర్ మరియు మోర్బీ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.బిపార్జోయ్ తుఫాను ప్రస్తుతం ముంబైకి దూరంగా ఉంది. జూన్ 15వ తేదీన మాండ్వి మరియు కరాచీల మధ్య బిపార్జోయ్ తీరం దాటే అవకాశం ఉంది. గరిష్టంగా గాలి వేగం 125- గంటకు 135 కి.మీ నుండి 150 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని IMD తెలిపింది.
బిపర్‌జోయ్ కారణంగా ఇప్పటికే ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అలలు ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్నాయి. పశ్చిమ రైల్వేలో పలు రైలు రద్దుకాగా, కొన్నింటిని ఆయా మార్గాల్లో కుదించి నడుపుతున్నారు.
సైక్లోన్ బైపార్జోయ్ దృష్ట్యా మొత్తం 69 రైళ్లు రద్దు చేయబడ్డాయి, 33 రైళ్లు షార్ట్-టర్మినేట్ చేయబడ్డాయి, 27 రైళ్లు ముందుజాగ్రత్త చర్యగా షార్ట్-ఆరిజియన్ చేయబడ్డాయి అని CPRO పశ్చిమ రైల్వే తెలిపింది.