Cyclone Shaheen: ముంచుకొస్తున్న మరో ముప్పు, గులాబ్ విధ్వంసానికి తోడవుతున్న షహీన్ తుఫాన్, అరేబియా సముద్రంలో సెప్టెంబర్ 30 తర్వాత గులాబ్ తుఫాన్ అవశేషాలతో అల్పపీడనం
Cyclones In India | Representational Image | (Photo Credits: Wikimedia Commons)

Mumbai, September 29: గులాబ్ తుపాన్ అల్లకల్లోలం మరచిపోకముందే మరో తుఫాన్ విరుచుకుపడనుంది. అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం బుధవారం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుపాన్ బలహీన పడిన అనంతరం అరేబియా సముద్రంలో మరో తుపాన్ (Intensify Into Depression Over Arabian Sea After September 30) ఏర్పడవచ్చని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.

సెప్టెంబర్ 30 తర్వాత గులాబ్ అవశేషాలతో అరేబియాలో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి షహీన్ తుపాన్ గా (Cyclone Shaheen) నామకరణం చేయనున్నారు. షహీన్ తుపాన్ పేరును ఖతార్ సూచించింది. దీనర్థం గరుడ పక్షి లేక రాబందు. రానున్న నాలుగైదు రోజుల్లో అరేబియా సముద్రంలో అల్పపీడనం (Cyclone Gulab May Be Reborn As Cyclone Shaheen) ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణశాఖ తెలిపింది.

భారీ వర్షాలకు వణుకుతున్న హైదరాబాద్, మరో 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేసిన వాతావరణ శాఖ

గులాబ్ తుపాన్ (Cyclone Gulab) అవశేషాల వల్ల రాబోయే రెండు రోజుల్లో గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. నవ్ సారి, వల్సాద్ లతోపాటు పొరుగు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని అహ్మదాబాద్ నగరంలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మనోరమ మొహంతి చెప్పారు.

సౌరాష్ట్ర, రాజ్ కోట్, నవ్ సారీ, వల్సాద్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. గుజరాత్ లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేశారు. గులాబ్ తుపాన్ వల్ల తెలంగాణలోనూ భారీవర్షాలు కురిసే అవకాశముందని అధికారులు చెప్పారు. ఈశాన్య అరేబియా సముద్రంలో మరో తుపాన్ ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ అధికారులు విడుదల చేసిన తాజా వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.

గులాబ్ మరచిపోకముందే మరో అల్పపీడనం, రాగల 48 గంటల్లో ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం, గులాబ్‌ తుపాను నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్

గత రెండేళ్లుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ అరేబియా సముద్రంలోకి వెళ్లి తీవ్రతరం కావడాన్ని గతంలో చూశామని అధికారులు చెప్పారు. 2018 నవంబరులో బంగాళాఖాతంలో సంభవించిన గజ తుపాన్ తమిళనాడు తీరం వైపు కదిలి మధ్య కేరళ తీరంలో ఉద్భవించింది.