Cyclone Bulbul Likely to Lash Odisha, Bengal and some states Today (Photo-IANS)

New Delhi, June 1: సైక్లోన్ అంఫాన్ విధ్వంసం (Cyclone Amphan) మరచిపోకముందే దేశానికి మరో తుఫాన్‌ ముప్పు పొంచి ఉన్నది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌ మధ్య ఆదివారం అల్ప పీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. సోమవారం నాటికి ఇది వాయుగుండంగా, మరుసటి రోజుకు తుఫాన్‌గాను మారవచ్చని పేర్కొంది. దీనికి ‘నిసర్గ’ (Cyclone Nisarga) అని పేరు పెట్టింది. ఇది ఉత్తర దిశగా కదిలి ఈ నెల 3 నాటికి గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర తీరానికి (Maharashtra Costal) చేరవచ్చని అంచనా వేసింది. దేశంలో కరోనా కల్లోలం, ఆసియాలో అగ్రస్థానంలోకి భారత్, దేశ వ్యాప్తంగా 2 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపిన ప్రధాని మోదీ

ఈ తుఫాన్‌ ప్రభావం వల్ల ఆదివారం, సోమవారం పలు చోట్ల మోస్తారు వర్షాలు, లక్షద్వీప్‌, కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, కురుస్తాయని ఐఎండీ పేర్కొన్నది. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు (Monsoon) విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ నెల 3, 4 తేదీల్లో దక్షిణ గుజరాత్‌, ఉత్తర కొంకణ్‌, మధ్య మహారాష్ట్ర, డయ్యూ , డామన్‌, దాద్రా అండ్‌ నగర్‌ హవేలిలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో ఈ నెల జూన్‌ 2న గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. 3న తూర్పు మధ్య, ఈశాన్య అరేబియా సముద్రంలోని మహారాష్ట్ర, గుజరాత్‌ తీర ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నదని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో నెల 4 వరకు ఆయా తీర ప్రాంతాల్లోని మత్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.  జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు, లాక్‌డౌన్‌ 5.0 మార్గదర్శకాలు, అనుమతించేవి, అనుమతించనవి ఓ సారి తెలుసుకోండి

నైరుతి రుతుపవనాలు 2020, జూన్ 01వ తేదీ సోమవారం కేరళను తాకే అవకాశమున్నదని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇందుకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ వరకు రుతుపవనాల విస్తరణ సాధారణగా ఉంటుందని, వంద శాతం వర్షపాతం నమోదవుతుందని ఏప్రిల్‌ 15న జారీ చేసిన తొలి దశ అంచనాల్లో IMD తెలిపింది. అయితే సోమవారం కేరళను నైరుతి రుతుపవనాలు తాకగానే రెండో దశ అంచనాలను విడుదల చేస్తామని చెప్పింది.  ప్రజలకు తీపి కబురు, జూన్ 10న తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు, రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం

మరోవైపు నైరుతి రుతుపవనాల విస్తరణ చురుగ్గా ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. విస్తరణ ఇదే స్థాయిలో కొనసాగితే ఈ నెల రెండో వారం ప్రారంభానికి నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశమున్నదని చెప్పారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదుకావచ్చని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.