New Delhi, Nov 14: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత కొద్దిగా మెరుగవడంతో బీఎస్-4 డీజిల్, బీఎస్-3 పెట్రోల్ వాహనాలపై (BS-3 Petrol, BS-4 Diesel Vehicles) నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉదయం నుంచి (Anti-Air Pollution Curbs End) ఎత్తివేసింది. గత కొద్ది రోజులుగా వాయు కాలుష్యం ఢిల్లీ నగరాన్ని వణికించిన సంగతి విదితమే. తాజాగా తగ్గుముఖం పట్టడంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖ ఢిల్లీలో కాలుష్య స్ధాయి పెరగడంతో బీఎస్-4 డీజిల్, బీఎస్-3 పెట్రోల్ వాహనాల రాకపోకలను నిషేధించింది.
కొద్ది రోజులుగా వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) నిలకడగా ఉందని, ఈ బ్యాన్‌కు సంబంధించి ఎలాంటి తాజా ఉత్తర్వులు వెలువడకపోవడంతో సోమవారం ఉదయం నుంచి బీఎస్-4 డీజిల్, బీఎస్-3 పెట్రోల్ వాహనాలపై నిషేధాన్నిసడలిస్తున్నట్టు ఢిల్లీ రవాణా శాఖ తెలిపింది.ఢిల్లీలో కాలుష్య పరిస్ధితిని సమీక్షిస్తున్నామని, వాయు నాణ్యత సూచీలో పెరుగుదల ఉంటే అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామని పేర్కొంది. కాలుష్య తీవ్రతతో నియంత్రణలను కొనసాగించాలా లేదా అనే దానిపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ఉన్నతస్ధాయి సమావేశం జరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.