Kalitara Mandal (Photo Credits: ANI)

New Delhi, February 8: నిన్న జరిగిన ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2020) అందరికంటే అత్యంత కురు వృద్ధురాలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేతికర్ర సాయం ఉంటే తప్ప అతి కష్టం మీద నాలుగు అడుగులు వేయలేని కలితారా మండల్‌ (Kalitara Mandal) అనే ఈ 110 సంవత్సరాల బామ్మ రాజ్యంగం ఇచ్చిన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆప్ పార్టీ  మేనిఫెస్టో

కాగా ఢిల్లీ ఓటర్లలో అందరికంటే పెద్ద వయసు గల వారు ఈమె. గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చిత్తరంజన్ పార్క్‌లోని ఎస్‌డిఎంసి ప్రైమరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకుంది. నీ పని నీవు చూసుకో, మోదీ మా దేశ ప్రధాని

ఓటు వేసిన అనంతరం బామ్మ మాట్లాడుతూ..‘ఈ ఎన్నికల్లో ఓటేసే వాళ్లలో నేనే అందరికంటే పెద్దదాన్నట’ ఇది నాకు చాలా గర్వంగా ఉందని తెలిపింది. ఓటు వేయటం ప్రతీ పౌరుడి హక్కు, ‘ఓటు చాలా ముఖ్యమైనది.

ANI Tweet:

ఇది రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం. నాకు ఓటు హక్కు వచ్చిప్పటి నుంచి తప్పకుండా ఓటేస్తున్నా. అందరికంటే పెద్దదానిగా ఢిల్లీలోని (Delhi) ప్రతి ఓటరును అలాగే దేశంలో ప్రతి ఒక్కరినీ నేను కోరేదొక్కటే.. నేను ఓటు వేస్తున్నా మీరు కూడా వేయండి’ అంటూ అందరికీ సందేశం ఇచ్చారు.

ఢిల్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోని విడుదల చేసిన కాంగ్రెస్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections 2020) ఓటేసిన కోటీ 47 లక్షల 86 వేల మందికి పైగా ఓటర్లలో.. కలితారా మండల్‌ అనే ఈ 110 సంవత్సరాల బామ్మే అందరికంటే సీనియర్ అని అధికారులు తెలిపారు.

ఢిల్లీ ప్రజలకు వరాల జల్లులు కురిపించిన భారతీయ జనతా పార్టీ

70 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 1.47 కోట్లకు పైగా ఓటర్లు 650 మంది అభ్యర్థుల అదృష్టాన్ని నిర్ణయించనున్నారు. మహిళలు, పురుషులేగాక ఢిల్లీలో 869 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఫలితాలు ఫిబ్రవరి 11న వెలువడనున్నాయి.