Delhi Chief Minister Arvind Kejriwal (Photo Credits: Agencies)

New Delhi, January 13: ఢిల్లీలో సోమ‌వారం నుంచి స్కూళ్ల‌ను ఓపెన్ చేయ‌నున్నారు. 10, 12వ త‌ర‌గ‌తుల విద్యార్థులకు స్కూల్ పాఠాలు స్టార్ట్ (Delhi Govt Schools To Reopen) కానున్నాయి. అయితే భౌతికంగా హాజ‌రు కావాల‌న్న అంశాన్ని విద్యార్థుల‌కే వ‌దిలేశారు. ప్రీ బోర్డు ప్రిప‌రేష‌న్‌, ప్రాక్టిక‌ల్ వ‌ర్క్‌ల‌ను దృష్టిలో పెట్టుకుని జ‌న‌వ‌రి 18వ తేదీ నుంచి విద్యార్థులు స్కూళ్ల‌కు హాజ‌రుకావాల‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.

త‌ల్లితండ్రుల నుంచి అనుమ‌తి తీసుకున్న త‌ర్వాత‌నే విద్యార్థులు స్కూళ్ల‌కు రావాలంటూ ఢిల్లీ ప్ర‌భుత్వం త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. స్కూళ్ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థుల రికార్డును మెయిన్‌టేన్ చేయాల‌ని ప్ర‌భుత్వం చెప్పింది. అయితే ఆ రికార్డును మాత్రం అటెండెన్స్‌గా వాడ‌రాదు అని పేర్కొన్న‌ది.

ఇదిలా ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Delhi Chief Minister Arvind Kejriwal) కేంద్రం ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ ను (Corona vaccine‌) ఉచితంగా అందించని పక్షంలో తమ ప్రభుత్వం ఢిల్లీ వాసులకు ఉచితంగా అందిస్తుందని బుధవారం వెల్లడించారు. ఢిల్లీ ప్రజలకు ఉచిత టీకా సరఫరా చేస్తానని ఇప్పటికే ప్రకటించిన ఆయన మరోసారి ఇదే విషయాన్ని ధృవీకరించారు.

కరోనా వ్యాక్సిన్ దెబ్బ, పోలియో చుక్కల కార్యక్రమం వాయిదా, తదుపరి నోటీసు వచ్చిన తరువాతనే... ఏటా జనవరి 17న జాతీయ పోలియో రోగనిరోధకత కార్యక్రమం

కోవిడ్-19 విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ హితేష్ గుప్తా కుటుంబాన్ని పరామర్శించిన కేజ్రీవాల్‌ వ్యాక్సిన్ గురించి ఎవ్వరూ తప్పుగా ప్రచారం చేయవద్దని కోరారు. కరోనా టీకాను అందరికీ ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానని, కేంద్రం దీనికి అంగీకరించకపోతే ఢిల్లీ ప్రజలకు తామే ఉచిత టీకా సౌకర్యాన్నిఅందిస్తామని ప్రకటించారు.

కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే వారి జాబితాలో చనిపోయిన వారి పేర్లు, 14 రోజుల తర్వాతనే కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం, వెల్లడించిన ఆరోగ్యశాఖ, దేశంలో తాజాగా 15,968 కొత్త కేసులు నమోదు

దేశ ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాను సరఫరా చేయాలని గతంలోఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్​-19 వ్యాక్సిన్​ను దేశ ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వాలనిగతంలో ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. టీకా ప్రతి ఒక్కరి హక్కు అని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్ ఈ నెల(జనవరి) 16 న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.