Murder (Photo Credits: Pixabay)

Gym Trainer Stabbed 15 Times by Father: ఢిల్లీలో పెళ్లికి కొన్ని గంట‌ల ముందే ఓ జిమ్ ట్రైన‌ర్(Gym Owner) దారుణ హ‌త్య‌కు గురయ్యాడు. అతని తండ్రే కొడుకుని 15 సార్లు పొడిచి చంపినట్లు తెలుస్తోంది. ప‌రారీలో ఉన్న తండ్రిని అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఫిట్ బాక్స్ అనే జిమ్‌ను నడుపుతున్న మృతుడు 29 ఏళ్ల గౌర‌వ్ సింఘాల్‌ తండ్రిని అవ‌మానించేవాడ‌ని, అది త‌ట్టుకోలేక అత‌ను కొడుకును క‌త్తితో పొడిచి చంపిన‌ట్లు పోలీసులు చెప్పారు. అయితే పెళ్లికి సిద్ధం అవుతున్న గౌర‌వ్ అనుకోకుండా తండ్రి చేతిలో హతమయ్యాడు. అత‌ని ముఖం, ఛాతిపై 15 క‌త్తిపోట్లు ఉన్నాయి.ఇంట్లో అతిథుల స‌మ‌క్షంలో పెళ్లి సంబ‌రాలు ఘ‌నంగా జ‌రుగుతుండ‌గానే ఈ దారుణానికి కసాయి తండ్రి పాల్పడ్డాడు.  షాకింగ్ వీడియో ఇదిగో, పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో బిల్డింగ్ మీద నుంచి దూకి సూసైడ్ చేసుకున్న ఇంటర్ విద్యార్థిని

Here's News