Social Media Ban Row: ఆర్మీలో ఫేస్‌బుక్‌తో పాటు సోష‌ల్ మీడియా బ్యాన్, సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించిన ఆర్మీ అధికారి, పిటిషన్‌ రేపు విచారణకు వచ్చే అవకాశం
Delhi High Court (Photo Credits: IANS)

New Delhi, July 13: భారత ఆర్మీలో పనిచేసే అధికారులు, సైనికులు ఫేస్‌బుక్‌తో పాటుగా 89 యాప్‌లను వారి ఫోన్‌ల నుంచి తొలగించాలని (Social Media Ban) కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఓ ఆర్మీ అధికారి (Army Officer Challenges Facebook Ban) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఫేస్‌బుక్ లాంటి వాటిని సైనికులు వాడ‌రాదు అని విధించిన నిషేధాన్ని స‌వాల్ చేస్తూ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ పీకే చౌద‌రీ ఢిల్లీహైకోర్టులో పిటిష‌న్ వేశారు. రేపు ఆ పిటిష‌న్‌పై ఢిల్లీ హైకోర్టు వాద‌న‌లు చేప‌ట్ట‌నున్న‌ది. భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం, టిక్‌టాక్ సహా మొత్తం 59 చైనీస్ యాప్‌లపై నిషేధం 

89 అప్లికేష‌న్లుతో పాటు కొన్ని వెబ్‌సైట్ల‌ను వాడ‌రాదు అని ప్ర‌భుత్వం ఓ విధానాన్ని ప్ర‌క‌టించింది. కానీ సోష‌ల్ సైట్ల‌పై ( Social Media Apps) నిషేధం విధించ‌డం భావ‌స్వేచ్ఛ‌కు, ప్రైవ‌సీ హ‌క్కును ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని క‌ల్న‌ల్ చౌద‌రీ త‌న పిటిష‌న్‌లో తెలిపారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న తాము కుటుంబ‌స‌భ్యుల‌తో గ‌డిపేందుకు ఫేస్‌బుక్ లాంటి సోష‌ల్ సైట్లు ఉప‌క‌రిస్తాయ‌ని ఆ క‌ల్న‌ల్ త‌న పిటిష‌న్‌లో తెలిపారు. ఎఫ్‌బీ, ఇన్‌స్టాలు త‌మ ఫ్యామిలీల‌తో క‌నెక్ట్ అయ్యేలా చేస్తాయ‌న్నారు. కాగా ప్రజా సేవలో ఉన్న నాయకులు, అధికారులు సైనికుల వద్ద కన్నా పెద్ద మొత్తంలో రహస్య సమాచారాన్ని కలిగి ఉంటారని చౌదరి అన్నారు. మరీ అలాంటి వ్యక్తులకు ఈ నిబంధనలు ఎందుకు వర్తించవని ప్రశ్నించారు. జూన్ ఆర‌వ తేదీన జారీ చేసిన ఆదేశాల‌ను డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మిలిట‌రీ ఇంటెలిజెన్స్ వెన‌క్కి తీసుకోవాల‌ని క‌ల్న‌ల్ కోరారు. చైనా భయపడిందా? రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన చైనా బలగాలు, చైనా విదేశాంగ మంత్రితో అజిత్ ధోవ‌ల్ చర్చలు

ఇదిలా ఉంటే తమ దేశానికి చెందిన 59 మొబైల్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన అంశాన్ని ఇటీవల న్యూఢిల్లీతో జరిపిన చర్చల్లో చైనా ప్రస్తావించింది. దౌత్య స్థాయిలో జరిగిన సమావేశంలో తమ మొబైల్ అప్లికేషన్లను నిషేధించడంపై చైనా ప్రశ్నించినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇందుకు భారత్ దీటుగా సమాధామిచ్చిందని, భద్రతాంశాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నామని, తమ పౌరుల డాటాకు సంబంధించిన అంశాల్లో రాజీ పడే ప్రసక్తి లేదని తేల్చిచెప్పిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇండియాలోని సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా వినియోగంలో ఉన్న టిక్ టాక్, హలో సహా 50 చైనా మొబైల్ యాప్‌లను గత జూన్ 29న భారత్ నిషేధించింది. జాతీయ సార్వభౌమాధికారం, భద్రతకు ముప్పు ఉందన్న కారణంగా వాటిని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. యూజర్ డాటాను సేకరించి, దానిని బయటకు పంపించే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69ఏ కింద ఈ చర్య తీసుకున్నట్టు కూడా కేంద్రం ప్రకటించింది. దీనిపై చైనా స్పందిస్తూ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల లీగల్ హక్కులను పరిరక్షించే బాధ్యత ఇండియాకు ఉందని పేర్కొంది. గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో.. డ్రాగ‌న్ దేశానికి చెందిన మొబైల్ యాప్‌ల‌పై భార‌త్ నిషేధం ప్ర‌క‌టించింది.