New Delhi May 18: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ (Anil Baijal) పదవికి రాజీనామా(Resign) వ్యక్తిగత కారణాల వల్లే తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు (Ramnath Kovind) పంపించారు. 2016 నుంచి అనిల్ బైజల్ ఢిల్లీ ఎల్జీగా (Delhi LG) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవిలో కొనసాగినంత కాలం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో(Delhi CM Kejriwal) ఆయన పొసిగేదే కాదు. చాలా సార్లు వారిద్దరి మధ్య పాలనా వ్యవహారాల్లో వివాదాలు తలెత్తాయి. తమ పాలనలో ఎల్జీ ప్రతిసారీ జోక్యం చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చాలాసార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పద్ధతి బాగో లేదని ఫైర్ అయ్యారు. చాలా విషయాల్లో వీరిద్దరి మధ్య పొసిగేది కాదు. కరోనా (Corona) సమయంలోనూ వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. కెండ్ కర్ఫ్యూను ఎత్తేయాలని సీఎం కేజ్రీవాల్ నిర్ణయం తీసుకుంటే.. ఎల్జీ అనిల్ బైజల్ వ్యతిరేకించారు. కేసుల సంఖ్య తగ్గలేదని, వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేయడం కుదరదని వ్యతిరేకించారు.
Delhi LG Anil Baijal resigns citing personal reasons. He has sent his resignation to the President: Sources
(file pic) pic.twitter.com/lmVxTdv8ZD
— ANI (@ANI) May 18, 2022
ఇక రైతు ఉద్యమ సమయంలో పోలీసుల తరపున వాదనలను వినిపించేందుకు కేజ్రీవాల్ సర్కార్ ఓ లాయర్ల బృందాన్ని ఎంపిక చేసింది. ఈ ప్యానెల్‌ను ఎల్జీ బైజల్ వ్యతిరేకించారు. మరో ప్యానెల్‌ను సూచించారు. దాంతో పాటూ మరో విషయంలోనూ సీఎం కేజ్రీవాల్, ఎల్జీ మధ్య వివాదం తలెత్తింది. ఢిల్లీ పాలనా వ్యవహారాల్లో సర్వాధికారాలు తనవేనంటూ, ఎల్జీ బైజల్ ఓ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో… సీఎం కేజ్రీవాల్ ఏ నిర్ణయం తీసుకున్నా… ఎల్జీని సంప్రదించే నిర్ణయం తీసుకోవాల్సి వుండేది. అయితే ఈ విషయంపై కేంద్ర హోంశాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి అనుగుణంగానే ఎల్జీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ కూడా వివాదానికి దారి తీసింది.
ఇక సారి అయితే సీఎం కేజ్రీవాల్‌పై (Kejriwal) విచారణ చేపట్టాలని ఎల్జీ బైజల్ ఏసీబీని ఆదేశించారు. కేజ్రీవాల్ తన బంధువుల కోసం 50 కోట్ల విలువైన భూదందాలను పరిష్కరించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. అంతేకాకుండా మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి కేజ్రీవాల్ 2 కోట్లు లంచం కూడా తీసుకున్నారని కపిల్ మిశ్రా ఆరోపించారు. దీనిపై ఎల్జీకి కపిల్ ఫిర్యాదు చేశారు. దీంతో ఎల్జీ సీఎంపై విచారణ చేపట్టాలని ఏసీబీని ఆదేశించారు.
అనిల్ బైజల్ 1969 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అటల్ బిహారీ వాజ్‌పాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో బైజల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఈ సమయంలోనే ఆయన కిరణ్ బేడీపై చర్యలు తీసుకున్నారు. జైళ్ల శాఖ నుంచి ఆమెను తప్పించి, సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ డిప్యూటీ సెక్రెటరీగా కూడా పనిచేశారు. 2016 లో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.