New Delhi, Dec 1: దేశ రాజధానిలో దారుణ ఘటన వెలుగు చూసింది. వ్యభిచారం చేసేందుకు నిరాకరించిందనే ఆగ్రహంతో దళిత బాలికను అపహరించి (Minor Dalit girl abducted) పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఢిల్లీలో మధురలో వెలుగుచూసింది. మధుర జిల్లా కోసికలన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాధిత బాలికను తల్లి కాపాడి నిందితుల చెర నుంచి విడిపించిందని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలికపై ఢిల్లీలో పలుమార్లు నిందితులు లైంగిక దాడికి పాల్పడ్డారు. వ్యభిచారం చేసేందుకు నిరాకరించిన ప్రతిసారీ ఆమెను తీవ్ర వేధింపులకు (repeatedly raped for resisting flesh trade) గురిచేశాడు. బాధితురాలు ఎలాగోలా తల్లికి విషయం చేరవేయడంతో ఆమె నిందితుల చెరనుంచి బాలికను విడిపించింది. ముగ్గురు నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని మధుర రూరల్ ఎస్పీ శిరీష్ చంద్ర వెల్లడించారు.నేరస్తులను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, ఇతర ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని ఎస్పీ (రూరల్) శ్రీశ్ చంద్ర తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే బాలికను ఐదు రోజుల పాటు పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారని తల్లిదండ్రులు ఆరోపించారు.ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం చేశారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా జిల్లా పోలీసు చీఫ్ ఆదేశాల తర్వాతే FIR నమోదు చేశారని ఆరోపించారు.