New Delhi, June 1: కరోనావైరస్‌పై డీఆర్డీవో సంధించిన తయారు చేసిన 2డీజీ డ్రగ్ (DRDO Anti-COVID Drug 2DG) లైవ్ లోకి వచ్చింది.. పొడి రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఔషధం.. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్లపై బాగా పని చేస్తున్నట్లు డీఆర్డీవో (DRDO) చెప్పింది. తాజాగా ఈ 2డీజీ మందును (Anti-COVID Drug 2DG) ఎలా వాడాలో చెబుతూ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందును వాడాలని స్పష్టం చేసింది. పాజిటివ్‌గా గుర్తించిన వెంటనే గరిష్టంగా 10 రోజుల పాటు డ్రగ్ ఇవ్వొచ్చు అని పేర్కొంది.
అయితే ఆస్పత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే డ్రగ్ వినియోగించాలని స్పష్టం చేసింది. నియంత్రణ లేని మధుమేహం, తీవ్రమైన హృద్రోగ, శ్వాసకోస, హెపాటిక్ రీనల్ ఇంపెయిర్మెంట్ సమస్యలు ఉన్నవారిపై ఈ డ్రగ్‌ను పరీక్షించలేదని, అలాంటివారికి వినియోగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం అని డీఆర్‌డీఓ సూచించింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వరాదు అని డీఆర్‌డీఓ స్పష్టంగా పేర్కొంది.
రోగులు, వారి బంధువులు ఈ డ్రగ్ కోసం ఆస్పత్రి యాజమాన్యాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను సంప్రదించవచ్చు. 2dg@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా డ్రగ్ సరఫరాకు విజ్ఞప్తి చేయవచ్చు. డీఆర్‌డీఓ రూపొందించిన 2-డీజీ సాచెట్ ధరను రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో 2డీజీ సాచెట్ ధర రూ.990గా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్‌లు అవసరం. చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది.
Here's ANI Update
The 2DG medicine can be given to Covid-19 patients under the care and prescription of doctors. Directions for the usage of this drug for COVID19 patients as per DCGI approval are attached here for reference: DRDO pic.twitter.com/To3TgULdSn
— ANI (@ANI) June 1, 2021
2డీజీ మందును ఎలా వాడాలో తెలియజేసే పలు మార్గదర్శకాలు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్లకు ఇస్తున్న చికిత్సకు అనుబంధంగా ఈ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
మోస్తరు నుంచి తీవ్ర కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్లకు సాధ్యమైనంత త్వరగా డాక్టర్లు ఈ మందును ప్రిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది. గరిష్ఠంగా పది రోజుల పాటు దీనిని వాడొచ్చు.
నియంత్రణ లేని డయాబెటిస్, తీవ్రమైన గుండె జబ్బులు, ఏఆర్డీఎస్ వంటి వ్యాధులతో బాధపడే వారిపై ఈ ఔషధాన్ని ఇంకా పూర్తిగా పరీక్షించి చూడలేదు. అందువల్ల కాస్త ముందు జాగ్రత్త అవసరం.
ఈ 2డీజీ ఔషధాన్ని గర్భిణులు, బాలింతలు, 18 ఏళ్ల లోపు పేషెంట్లకు ఇవ్వకూడదు.
2DG@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను 2డీజీ ఔషధం సప్లై చేయాలని పేషెంట్లు, వాళ్ల అటెండర్లు ఆయా హాస్పిటల్స్‌ను కోరవచ్చు.