Hijacked RTC Bus | Photo: Twitter

Vikarabad, February 18: ఇదొక విచిత్రమైన సంఘటన వికారాబాద్ జిల్లాలోని తాండూరులో 15 మంది ప్రయాణికులతో కూడిన ఆర్టీసీ బస్సును (TSRTC Bus) ఒక తాగుబోతు వ్యక్తి (Tippler)  హైజాక్ (Hijack) చేశాడు. ఆ తర్వాత బస్సును మార్గమధ్యంలో ఒకచోట వదిలేసి, అక్కడ్నించి పారిపోయాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే, కరణ్‌కోట్ నుంచి ఓగిపూర్ వెళ్లాల్సిన చివరి బస్ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రయాణ ప్రాంగణంలోకి వచ్చి ఆగింది. డ్రైవర్, కండక్టర్ డిన్నర్ చేయడానికి క్యాంటీన్‌కు వెళ్లారు. ప్రయాణికులు ఒక్కొక్కరుగా ఎక్కుతున్నారు. మొత్తం 15 మంది ప్రయాణికులు బస్సులో ఎక్కి కూర్చున్నారు. ఇంతలో ఒక గుర్తుతెలియని వ్యక్తి వచ్చి నేరుగా డ్రైవర్ సీటులో కూర్చుని బస్ స్టార్ట్ చేశాడు. బస్సులోని ప్రయాణికులు హమ్మయ్య డ్రైవర్ వచ్చాడు, ఈరోజు తొందరగా వెళ్తున్నాం అనుకున్నారు. కానీ కొద్దిసేపట్లోనే బస్సులోని ప్రయాణికులకు ఆ డ్రైవర్ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' (Fast & Furious) సినిమా చూపించాడు. ఆ డొక్కు బస్సును, గతుకుల రోడ్డుపై కూడా రాకెట్ వేగంతో రాష్‌గా తోలుతుంటే అందులోని ప్రయాణికులు గాల్లో తేలిపోయాయారు.

ఆపరా బాబు అంటూ డ్రైవర్ వద్దకు వెళ్లి అడిగితే అసలు తగ్గలేడు. కండక్టర్ ఎక్కడా అని అడగగా, 'నేనే డ్రైవర్.. నేనే కండక్టర్' అంటూ బదులిచ్చాడు. వాళ్లకు అర్థమైంది, అసలు అతడు డ్రైవరే కాదు, అంతేకాకుండా ఫుల్‌గా తాగేసి ఉన్నాడు. ఆపై అతడి డ్రైవింగ్‌తో ప్రయాణికులు భయాందోళనతో ఉండిపోయారు.

ఇక మరోవైపు, డ్రైవర్, కండక్టర్లు తీరిగ్గా డిన్నర్ చేసి తిరిగి వచ్చి చూసే సరికి బస్సు, బస్సులోని ప్రయాణికులు మాయం. బస్సు కోసం అక్కడాఇక్కడా అంతా వెతికి, వెంటనే డిపో అధికారులకు 'బస్సు ఎక్కడోపోయింది' అని సమాచారం ఇచ్చారు. వారు కూడా వెంటనే బస్సు కోసం వెతకడం ప్రారంభించారు.

మళ్లీ బస్సు సీన్ లోకి ఎంటర్ అయితే అందులోని ప్రయాణికులు డిపో మేనేజర్ కు జరిగిన విషయం, సమాచారం చేరవేశారు. బస్సులోని ప్రయాణికులంతా డ్రైవర్ వద్దకు వచ్చి వాగ్వివాదం చేయడంతో, చిరాకు పడ్డ ఆ తాగుబోతు డ్రైవర్ ఆగిఉన్న ఓ వాహనాన్ని ఢీకొట్టి, బస్సును అక్కడ ఆపేసి అక్కడ్నించి పరారయ్యాడు. దొంగతనానికి వచ్చి, మద్యం తాగేసి, అదే ఇంట్లో పడుకున్న దొంగ

సంఘటనా స్థలానికి హుటాహుటిన డిపో అధికారులు, పోలీసులు చేరుకుని ఆ బస్సును స్వాధీనం చేసుకున్నారు. అందులోని ప్రయాణికులు బతుకు జీవుడా అనుకున్నారు. పోలీసులు దొంగతనం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.