Earthquake Representational Image- PTI

Rajkot, June 15: ఉత్తరాది రాష్ట్రాలలో వరుస భూకంపాలు (Serial earthquakes) ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఢిల్లీ, గుర్గావ్, ఎన్సీఆర్, నొయిడా ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూకంపాలు వచ్చిన సంగతి విదితమే. ఇక గుజరాత్ కూడా భూకంపంతో (Earthquake in Gujarat) హడలిపోతోంది. ఆ రాష్ట్రాన్ని రెండో సారి భూంకంపం వణికించింది. 24 గంటలు గడవక ముందే రెండోసారి భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆరవ దశ లాక్‌డౌన్ లేనట్లే, ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని స్పష్టం చేసిన కేజ్రీవాల్, హోంమంత్రి ఆధ్వర్యంలో ముగిసిన అఖిలపక్ష సమావేశం

సోమవారం మధ్యాహ్నం 12.57 గంటల సమయంలో రాజ్‌కోట్‌ సమీపంలో రెండోసారి భూకంపం చోటు చేసుకుంది. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. రాజ్‌కోట్‌కు వాయవ్య దిశలో 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్‌లో ఆదివారం రాత్రి 8 గంటలకు రాజ్‌కోట్‌, గుజరాత్‌ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వ్యాయువ్యంగా ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్‌ స్కేల్‌పై 5.8గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీంతో రాజ్‌కోట్‌ వాసులు ఆందోళనకు గురయ్యారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ( భూకంపం అధ్యయనాల కేంద్రం) వెల్లడించిన వివరాల ప్రకారం రిక్టార్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 4.6 మేగ్నిట్యూడ్‌గా నమోదైంది. అయితే, భూకంపం తీవ్రత పెద్దదేమీ కానప్పటికీ.. కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే భూమి రెండుసార్లు కంపించడం అక్కడి వారిని ఆందోళనకు గురిచేసింది. ఈ భూకంపం ధాటికి కచ్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ రెండు భూకంపాలకు భూకంపం కేంద్రం బచావుకి (Bhachau region) సమీపంలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

కాగా ఆదివారం రాత్రి 8.13 గంటలకు రాజ్‌కోట్‌కి వాయువ్య దిశలో 122 కిమీ దూరంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై (Richter Scale) ఈ భూకంపం తీవ్రత 5.8గా నమోదైంది