ఈశాన్య రాష్ట్రాలైన అసోం, మేఘాలయల్లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం కథనం ప్రకారం సోమవారం సాయంత్రం 6.15 గంటలకు భూమి కంపించింది. మేఘాలయలోని నార్త్ గ్యారో హిల్స్ వద్ద భూకంప కేంద్రం కేంద్రీక్రుతమై ఉందని తెలిపింది.
అసోం, మేఘాలయలతోపాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనాల్లోనూ భూమి కంపించినట్లు వార్తలు వచ్చాయి. భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు వార్తలు రాలేదు. ఇంకా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Here's News
An Earthquake of magnitude 5.2 occurred in North Garo Hills at 6:15 pm today: National Center for Seismology pic.twitter.com/vrQqwBim9m
— ANI (@ANI) October 2, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)