Aizawl, June 22: ఈశాన్య భారతాన్ని వరుస భూకంపాలు(Earthquakes in Mizoram) హడలెత్తిస్తున్నాయి. మిజోరంలో 12 గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి (Earthquakes in Mizoram) కంపించింది. సోమవారం తెల్లవారుజామున 4:10 గంటలకు మిజోరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ( (NCS )పేర్కొంది. దీని ప్రభావం ఎక్కువగా ఛంపాయ్ జిల్లాలో నమోదైందని దాదాపు 27 కిలోమీటర్ల లోతు వరకు భూమి కంపించినట్లు తెలిపింది. కరోనా పని ఖతం అయినట్లేనా, కోవిఫర్ ఇంజక్షన్‌కు డిసిజిఐ అనుమతి, 100 మిల్లీగ్రాముల ఇంజెక్షన్ ఖరీదు రూ.5000 నుంచి రూ.6000 మధ్య ఉండే అవకాశం
అయితే దీని ద్వారా ఎటువంటి ప్రాణనష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేని అధికారులు వెల్లడించారు. ఆదివారం 4:16 గంటలకు మణిపూర్‌లో భూకంపం సంభవించగా, రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్లు మణిపూర్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎర్త్ సైన్స్ విభాగం వెల్లడించిన సంగతి తెలిసిందే. జూన్ 18న ఐదు ఈశాన్య రాష్ర్టాల్లో భూకంపం సంభవించింది. ఛంపాయ్ (Champai), షిల్లాంగ్ సహా ఐదు ప్రధాన నగరాల్లో భూకంపం భూ ప్రకంనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
Here's ANI Tweet
Two earthquakes rocked Mizoram within 12 hours. Damage assessment has been undertaken by concerned MLA & district administration. Fortunately, no casualties reported so far. Thanking PM & Home Minister for their assurance of support: Chief Minister of Mizoram, Zoramthanga pic.twitter.com/3eGtMjGUyC
— ANI (@ANI) June 22, 2020
రాజధాని ఐజ్వాల్‌లో నిన్న సాయంత్రం 4 గంటలకు భూకంపం సంభవించింది. దాని తీవ్రత 5.1గా నమోదయ్యింది. మిజోరంకు 9 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని మణిపూర్ యూనివర్సిటీ భూ విజ్ఞాన శాస్త్ర విభాగం వెల్లడించింది. ఈరోజు సంభవించిన భూకంపం కారణంగా రాజధాని ఐజ్వాల్ సహా చాలా జిల్లాల్లో ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. కాగా, ప్రమాదంపై మిజోరం సీఎం జోరంగతంగాతో ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు.