PM Modi addressing the nation on coronavirus situation | (Photo Credits: DD News)

New Delhi, May 25: దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సోమవారం రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు (Eid Mubarak 2020) తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ పండగ చేసుకోవాలని ఆయన కోరారు. ‘ఈద్‌ ఉల్‌ పితర్‌ (Eid-ul-Fitr) సందర్భంగా ఈద్‌ ముబారక్‌. ఈ పర్వదినం కరుణ, సోదర భావాన్ని, సామరస్యాన్ని మరింత పెంచుతుందని ఆశిసస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.

రంజాన్‌ ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధిని కలుగజేయాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కరుణ, సేవాతత్పరత, సుహృద్బావానికి రంజాన్‌ పండుగ ప్రతీక రంజాన్ అని అన్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. Ramzan Mubarak 2020 Wishes: ముస్లీంలకు అతి పవిత్ర మాసం రంజాన్, ఆ పండుగ గొప్పతనాన్ని తెలుసుకోండి, Quotes,Wishes, Sms, Images, Ramzan Mubarak 2020 గ్రీటింగ్స్ మీకోసం

ప్రపంచంలోని ముస్లింలందరికీ ఈ పండుగ ముఖ్యమైనది, రంజాన్, నెకిస్ మాసంలో జరుపుకుంటారు. ఈద్ అల్-ఫితర్ 2020 కేరళ మరియు కాశ్మీర్ రాష్ట్రాల్లో మే 24 (ఆదివారం) జరుపుకోగా, మిగతా దేశాలు ఈ రోజు పాటించనున్నాయి. ఈ పండుగను బాడీ ఈద్ అని కూడా పిలుస్తారు మరియు వేడుకతో పాటు షీర్ కోర్మా, బిర్యానీ మరియు ఇతర రుచికరమైన వంటకాలు ఈ పండుగలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

కరోనావ్యాప్తి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ముస్లింలు ఇంటివద్దనే రంజాన్‌ వేడుకలు జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఇంటి దగ్గర ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఢిల్లీలోని తన నివాసంలో రంజాన్‌ ప్రార్థనల్లో పాల్గొన్నారు. లాక్‌ డౌన్‌ 4.0 కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నైలోని ట్రిప్లికానే ఏరియాలో వాలాజా మసీదును మూసివేశారు. ఢిల్లీలోని చాందినీ చౌక్‌ ప్రాంతంలోని ఓ ఇంట్లో రంజాన్‌ ప్రార్థనలు నిర్వహించారు. కర్ణాటకలోని హుగ్లీతోపాటు ఇతర ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు.