దేశంలో మళ్లీ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే మళ్లీ ఎలక్షన్స్‌కు ఎన్నికల సంఘం (Election Commission) సిద్ధమైంది. మొత్తం ఏడు రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జులై 10న ఉప ఎన్నికలు (Bypolls) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 10చోట్ల ఎమ్మెల్యేల రాజీనామాలు, మూడుచోట్ల ప్రజాప్రతినిధుల మృతితో బైపోల్స్ అనివార్యమయ్యాయి. జులై 15 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిఉందని ఈసీ వెల్లడించింది. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ, కేబినెట్ లోని మంత్రులు వీళ్లే (వీడియో ఇదుగోండి)
రుపౌలీ (బిహార్), రాయ్‌గంజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగ్దా, మానిక్‌తలా (పశ్చిమ బెంగాల్), విక్రవాండీ (తమిళనాడు), అమర్‌వాడా (మధ్యప్రదేశ్), బద్రీనాథ్, మంగ్లౌర్ (ఉత్తరాఖండ్), జలంధర్ వెస్ట్ (పంజాబ్), డెహ్రా, హమీర్‌పుర్, నాలాగఢ్ (హిమాచల్ ప్రదేశ్) అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మానిక్‌తాలా, విక్రవాండీ, మంగ్లౌర్ స్థానాల్లో ఎమ్మెల్యేలు మృతిచెందగా.. మిగతాచోట్ల రాజీనామా చేశారు.
షెడ్యూల్ వివరాలిలు ఇవిగో..
నోటిఫికేషన్ విడుదల: జూన్ 14
నామినేషన్లకు చివరి తేదీ: జూన్ 21
నామినేషన్ల పరిశీలన: జూన్ 24
ఉపసంహరణ గడువు: జూన్ 26
పోలింగ్ తేదీ: జులై 10
ఓట్ల లెక్కింపు: జులై 13